‘రంగస్థలం’కు అన్యాయం జరిగిందా.?

కొద్దిసేపటి క్రితం 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం, అ, చి.. ల..సౌ చిత్రాలుకు అవార్డులు దక్కడం విశేషం. అటు ఉత్తమ నటులుగా ఆయుష్‌మాన్ ఖురానా, విక్కీ కౌశల్ ఎంపికయ్యారు. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రానికి ఆడియోగ్రఫీకి అవార్డు రావడం జరిగింది. అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియాలో హాట్ […]

'రంగస్థలం'కు అన్యాయం జరిగిందా.?
Ravi Kiran

|

Aug 09, 2019 | 8:20 PM

కొద్దిసేపటి క్రితం 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం, అ, చి.. ల..సౌ చిత్రాలుకు అవార్డులు దక్కడం విశేషం. అటు ఉత్తమ నటులుగా ఆయుష్‌మాన్ ఖురానా, విక్కీ కౌశల్ ఎంపికయ్యారు.

ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రానికి ఆడియోగ్రఫీకి అవార్డు రావడం జరిగింది. అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. టాలీవుడ్‌ సూపర్ హిట్ సినిమా ‘బాహుబలి’ తర్వాత అంతటి విజయం సాధించిన ఈ మూవీకి కేవలం ఒక్క అవార్డు.. అందులోనూ ఆడియోగ్రఫీకి రావడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగిన ‘రంగస్థలం’ సినిమాకు హీరో రామ్ చరణ్ నటన హైలైట్. అంతేకాకుండా ఆయన నటనకు క్రిటిక్స్ నుంచి సినీ ప్రముఖుల వరకు ప్రశంసలు అందాయి. విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా వారి సినిమాల్లో అద్భుతంగా నటించిన మాట వాస్తవమే కానీ.. రామ్ చరణ్ అంతకు మించి నటించారని ఫ్యాన్స్ ట్విట్టర్ వేదిక ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఉత్తమ నటుడి అవార్డు పొందేలా రామ్ చరణ్ యాక్టింగ్ ఉందని.. జ్యూరీ సభ్యులు ‘రంగస్థలం’ మూవీని పట్టించుకోలేదని అంటున్నారు. ఏది ఏమైనా ఫ్యాన్స్ అనేది కూడా నిజమే.. రామ్ చరణ్ ఈ మూవీలో చెవిటివాడిగా అద్భుతంగా నటించాడు. ఆ ఇద్దరి నటులతో పాటు రామ్ చరణ్‌‌కి కూడా ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాల్సిందని అభిమానులు అంటున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu