శ్రద్ధాకి ఐ లవ్ యూ చెప్పిన ప్రభాస్

ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రద్ధాకపూర్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. రెండేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాతో పనిచేసిందని.. ముంబయి నుంచి వస్తూ ఒక్కరోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని గుర్తు […]

శ్రద్ధాకి ఐ లవ్ యూ చెప్పిన ప్రభాస్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2019 | 6:46 AM

ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రయూనిట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రద్ధాకపూర్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. రెండేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాతో పనిచేసిందని.. ముంబయి నుంచి వస్తూ ఒక్కరోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని గుర్తు చేశారు. యాక్షన్‌ సన్నివేశాలు కూడా బాగా చేసిందన్నారు. శ్రద్ధాకపూర్ సాహోకు పనిచేయడం మా అదృష్టమంటూ.. శ్రద్ధాకి ఐ లవ్ యూ అంటూ చెప్పారు ప్రభాస్.