చాలా ప్రయత్నించాం కానీ.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కోసం ‘ఆర్ఆర్ఆర్’ ట్వీట్..!

మరో రెండు రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతోంది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్‌ మూవీ నుంచి జూనియర్ గ్లిమ్స్‌ వస్తుందని ఆయన అభిమానులందరూ ఇన్నిరోజులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. చెర్రీ పుట్టినరోజు సందర్భంగా భీమ్‌ ఫర్ రామరాజు పేరుతో ఓ స్పెషల్ టీజర్ రాగా.. ఈ సారి ఎన్టీఆర్ పుట్టినరోజుకు అల్లూరి ఫర్ కొమరం పేరుతో ఓ వీడియో వస్తుందని అందరూ భావించారు. అయితే వారి ఆశలపై ఆర్ఆర్ఆర్ టీమ్‌ నీళ్లు చల్లింది. ఎన్టీఆర్‌ […]

చాలా ప్రయత్నించాం కానీ.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కోసం 'ఆర్ఆర్ఆర్' ట్వీట్..!

మరో రెండు రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతోంది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్‌ మూవీ నుంచి జూనియర్ గ్లిమ్స్‌ వస్తుందని ఆయన అభిమానులందరూ ఇన్నిరోజులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. చెర్రీ పుట్టినరోజు సందర్భంగా భీమ్‌ ఫర్ రామరాజు పేరుతో ఓ స్పెషల్ టీజర్ రాగా.. ఈ సారి ఎన్టీఆర్ పుట్టినరోజుకు అల్లూరి ఫర్ కొమరం పేరుతో ఓ వీడియో వస్తుందని అందరూ భావించారు. అయితే వారి ఆశలపై ఆర్ఆర్ఆర్ టీమ్‌ నీళ్లు చల్లింది. ఎన్టీఆర్‌ గ్లిమ్స్‌ను విడుదల చేయలేకపోతున్నామని మూవీ యూనిట్ సోషల్ మీడియాలో ప్రకటించింది.

లాక్‌డౌన్‌ కొనసాగుతూ వచ్చిన తరుణంలో అనుకోకుండా పని ఆగిపోయింది. మేము చాలా ప్రయత్నించినప్పటికీ.. ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మీకు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్న అతడి గ్లిమ్స్‌కి సంబంధించిన పని పూర్తి అవ్వలేదు. అందుకే ఫస్ట్‌లుక్‌ గానీ.. వీడియోను గానీ విడుదల చేయలేకపోతున్నాము. తారక్‌కి సంబంధించి అంతకుమించిది మీకు గిఫ్ట్‌గా ఇస్తామని మాటిస్తున్నాం. అది వచ్చిన రోజు మీతో పాటు మా అందరికీ కూడా ఎద్ద పండుగ అని ఆర్ఆర్ఆర్ టీమ్ తెలిపింది.

కాగా ఫిక్షన్ కథాంశంతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్‌ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. వారి సరసన అలియా భట్‌, ఒలివియా రొమాన్స్‌ చేయబోతున్నారు. అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. పలు భారతీయ భాషల్లో వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.

Read This Story Also: Breaking: CBSE 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..!

Click on your DTH Provider to Add TV9 Telugu