ఛార్మీ సంచలన నిర్ణయం.. అధికారిక ప్రకటన..!

15 ఏళ్లకే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 50కి పైగా చిత్రాల్లో నటించిన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ.. ఈ మధ్య కాలంలో నిర్మాతగా దూసుకుపోతుంది.

ఛార్మీ సంచలన నిర్ణయం.. అధికారిక ప్రకటన..!
Follow us

| Edited By:

Updated on: May 18, 2020 | 4:15 PM

15 ఏళ్లకే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 50కి పైగా చిత్రాల్లో నటించిన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ.. ఈ మధ్య కాలంలో నిర్మాతగా దూసుకుపోతుంది. జ్యోతిలక్ష్మి సమయంలో నిర్మాణ రంగంలోకి అడుగెట్టిన ఈ బ్యూటీ.. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై వరుసగా పూరీ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇక గతేడాది ఇస్మార్ట్ శంకర్‌తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కాగా ఈ బ్యూటీ ఇప్పుడు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై తాను స్క్రీన్‌పై కనిపించనని వెల్లడించింది.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఛార్మీ.. ఇండస్ట్రీలో టాలెంట్‌తో చాలామంది హీరోయిన్లు వస్తున్నారు. జ్యోతిలక్ష్మి సమయంలోనూ సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నా. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలనుకున్నా. అయితే నటించకూడదని అని నువ్వు నిర్ణయించుకుంటే నటనకు దూరంగా ఉండు.. కానీ బయటికి చెప్పకు అని నిర్మాత కల్యాణ్‌ తెలిపారు. అందుకే దానిపై ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నా. కానీ ఇప్పుడు చెబుతున్నా. యాక్టింగ్‌కి దూరంగా ఉంటా అని పేర్కొన్నారు. ఇక ఫైటర్‌ తరువాత రెండు భారీ చిత్రాలను నిర్మించబోతున్నట్లు తెలిపిన ఛార్మీ.. వెబ్‌ సిరీస్‌లు నిర్మించాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు పేర్కొంది. కాగా విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ తెరకెక్కిస్తోన్న ఫైటర్‌ని కరణ్‌ జోహర్‌తో కలిసి ఛార్మీ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: నిరుద్యోగులకు ప్రముఖ సంస్థ గుడ్‌న్యూస్.. 75 మిలియన్‌ డాలర్‌లతో..!