RRR Movie: ఆస్కార్‌ నామినేషన్స్‌కూ నోచుకోని పాన్‌ ఇండియా మూవీ RRR.. అయినా కానీ, తగ్గేదేలే..

ట్రిపులార్‌ మూవీ టాలీవుడ్‌ సత్తాను ప్రపంచానికి చాటింది. డైరెక్టర్‌ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న రిలీజై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

RRR Movie: ఆస్కార్‌ నామినేషన్స్‌కూ నోచుకోని పాన్‌ ఇండియా మూవీ RRR.. అయినా కానీ, తగ్గేదేలే..
RRR Movie
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 21, 2022 | 1:16 PM

Oscar Awards nominations: 2023 ఆస్కార్ రేసులో భారత్ నుంచి గుజరాతీ ఫిల్మ్ ఛెల్లో షో మూవీకి చోటు దక్కింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఛెల్లోషో మూవీ ఇండియా తరఫున నామినెట్ అయ్యింది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ట్రిపుల్ ఆర్ (RRR) మూవీ.. ఆస్కార్ నామినేషన్ రేసులో చోటు దక్కించుకోలేక పోయింది. ఇక కశ్మీర్ ఫైల్స్, శ్యామ్‌ సింగరాయ్‌కి కూడా ఆస్కార్ రేసులో చోటు దక్కలేదు.

మార్చి 25న రిలీజై.. సునామీ సృష్టించిన RRR

ట్రిపులార్‌ మూవీ టాలీవుడ్‌ సత్తాను ప్రపంచానికి చాటింది. డైరెక్టర్‌ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న రిలీజై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. దాదాపు 1000కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. భారత్‌తోపాటు వాల్డ్‌వైజ్‌ ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉందని జోరుగా ప్రచారం సాగింది. బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరిలో రామరాజు పాత్రకు చరణ్, కొముర్రం భీమ్ పాత్రకు జూనియర్‌ ఎన్టీయార్‌ను నామినేట్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే.. భారత్ తరుపున ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంపిక కాకపోవడంపై RRR బృందం స్పందించింది. RRR US డిస్ట్రిబ్యూటర్, వేరియన్స్ ఫిల్మ్స్, ఈ చిత్రాన్ని అన్ని కేటగిరిస్‌లోనూ పరిగణించాలని 95 ఆస్కార్ అకాడమీ జ్యూరీ సభ్యులను అభ్యర్థించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ‘ఛేల్లో షో నామినేట్‌

రామ్‌ చరణ్‌ లేదా తారక్‌కు ఆస్కార్‌ అవార్డు వస్తుందని ఫ్యాన్స్‌ సంబరపడిపోయారు. అయితే వారందరి ఆశలు నీరుగారిపోయాయి. ఆస్కార్ నామినేషన్స్ లో RRR పేరు లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ట్రిపులార్‌తో పాటు పోటీపడిన కశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా చోటు దక్కలేదు. ఈ రెండింటిని దాటుకోని ఓ చిన్న సినిమా ఆస్కార్‌బరిలో నిలవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2023 ఆస్కార్ నామినేషన్ లో గుజరాతీ సినిమా ‘ఛేల్లో షో’ చోటు దక్కించుకొంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ‘ఛేల్లో షో’ నామినేట్ అయ్యింది. పెద్ద సినిమాలను పక్కకు నెట్టి ఒక చిన్న సినిమా ఆస్కార్ నామినేషన్‌లో నిలిచింది.

9ఏళ్ల వయసులో సినిమాతో ప్రేమలో పడిన కుర్రాడి కథ..

ఆస్కార్‌ అవార్డు రేసులో నిలిచిన చెల్లో షో కథేంటి..? ఫిల్మ్‌ పెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాను అంతలా ఆకట్టుకునేలా ఈ సినిమాలో ఏముంది..? పీరియాడిక్ మూవీ ట్రిపులార్‌ను మించిన సీన్స్‌ ఏమున్నాయనే ఆలోచన వస్తుంది. తొమ్మిదేళ్ల వయసులో సినిమాతో ప్రేమలో పడిన కుర్రాడి కథకు ఆస్కార్‌ అవకాశం దక్కింది. గుజరాత్‌లోని ఓ మూరుమూల పల్లెటూరులో జరిగే కథతో తెరకెక్కిన చిత్రమే ‘ఛెల్లో షో’. గుజరాత్‌లోని చలాలా అనే పల్లెటూర్లో పుట్టిపెరిగిన తొమ్మిదేళ్ల సమయ్‌ అనే కుర్రాడికి థియేటర్‌ ప్రొజెక్టర్‌ ఆపరేటర్‌తో పరిచయం ఏర్పడుతుంది. తరచూ ప్రొజెక్షన్‌ గదిలోకి వెళుతుంటాడు. ప్రొజెక్టర్‌ నుంచి వచ్చే కాంతి తెరపై బొమ్మగా మారడం అతనిలో మరింత ఆసక్తిని పెంచుతుంది. ప్రొజెక్షన్‌ బూత్‌లో కూర్చొని వేసవి మొత్తాన్ని గడిపేస్తాడు. దీంతో సినిమాపై విపరీతమైన మమకారం పెంచుకుంటాడు. సినిమాని పిచ్చిగా ప్రేమించడం మొదలుపెడతాడు. అది అతడి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది..చివరికి తన ఆసక్తిని అతడు ఎలా నెరవేర్చుకున్నాడు? మల్టీఫ్లెక్స్‌లు వచ్చాక..చిన్న చిన్న థియేటర్లు ఎలా మాయమయ్యాయి..అన్నదే స్టోరీ.

13 చిత్రాలను దాటుకొని బరిలో నిలిచిన మూవీ

మొత్తానికి చెల్లో షో మూవీ 95వ ఆస్కార్‌ పురస్కారాల కోసం భారత్‌ నుంచి ఎంపికైంది. 13 చిత్రాలను దాటుకొని బరిలో నిలిచింది. మాస్టర్‌ భవిన్‌ రబరి ప్రధాన పాత్రలో తన బాల్య జ్ఞాపకాలనే సినిమాగా మలిచారు దర్శకుడు పాన్‌ నళిన్‌. ఐతే ట్రిపులార్‌, కశ్మీర్‌ఫైల్స్‌ వంటి సినిమాలో ఎంపిక కాకుండా, సినిమా పేరే తెలియని ఒక ఇటాలియన్‌ మూవీ ఫ్రీమేక్‌ లాంటి సినిమాను ఎంపిక చేయటంపై నెటిజన్స్‌ పెదవి విరుస్తున్నారు. సినిమాలపై పొలిటికల్ ఎఫెక్ట్‌ ఉండవచ్చనే కామెంట్స్‌ సైతం వినిపిస్తున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే