Tollywood: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 75కే మల్టీప్లెక్సుల్లో మూవీ చూసే ఛాన్స్.!
ఈ మధ్యకాలంలో మల్టీప్లెక్స్‌లలో సినిమాలు చూడాలంటే.. జేబులకు చిల్లు పడాల్సిందే. సుమారు రూ. వెయ్యి నుంచి రెండు వేల వరకు ఖర్చు అవుతుంది.
ఈ మధ్యకాలంలో మల్టీప్లెక్స్‌లలో సినిమాలు చూడాలంటే.. జేబులకు చిల్లు పడాల్సిందే. సుమారు రూ. వెయ్యి నుంచి రెండు వేల వరకు ఖర్చు అవుతుంది. అలాంటిది మీకు రూ. 75కే సినిమా చూసే ఛాన్స్ వస్తే.. మూవీ లవర్స్‌కు అంతకంటే హ్యాపీ ఇంకేముంది చెప్పండి.! అందుకే వారికోసమే ఈ గుడ్ న్యూస్. సెప్టెంబర్ 23వ తేదీ జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MAI) మూవీ లవర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 23.. ఒక్క రోజు అన్ని ప్రధాన నగరాలలోని మల్టీప్లెక్స్‌లలో రూ. 75కే అన్ని సినిమాలు చూడవచ్చు.
పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ లాంటి ప్రధాన మల్టీప్లెక్స్‌లు ఈ డిస్కౌంట్ రేట్‌కే టికెట్లు విక్రయించనున్నాయి. డైరెక్ట్‌గా అయితే టికెట్ రేట్ రూ. 75 ఉంటుంది గానీ.. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునేవారికి మాత్రం అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక థియేటర్లలో ప్రస్తుతం పలు మంచి చిత్రాలు స్క్రీనింగ్ అవుతున్నాయి. వాటిల్లో ‘ఒకే ఒక జీవితం’, ‘బ్రహ్మాస్త్ర’ మంచి టాక్ సంపాదించుకున్నాయి. మరి అందులో మీకు నచ్చిన సినిమాను ఈ ‘నేషనల్ సినిమా డే’ రోజున రూ. 75కే చూసే ఛాన్స్ కొట్టేయచ్చు.