RRR movie: షాకింగ్: ‘ఆర్ఆర్ఆర్’కు ఇద్దరు డైరక్టర్లు..రాజమౌళితో పాటు..!
'ఆర్ఆర్ఆర్' డైరక్టర్ ఎవరంటే.. దర్శకధీరుడు రాజమౌళి అని సినిమా అంటే ఆసక్తి ఉన్న ఎవ్వరైనా టక్కున చెప్పేస్తారు. బాహుబలి లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మొదటిసారి కలిసి నటిస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ డైరక్టర్ ఎవరంటే.. దర్శకధీరుడు రాజమౌళి అని సినిమా అంటే ఆసక్తి ఉన్న ఎవ్వరైనా టక్కున చెప్పేస్తారు. బాహుబలి లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మొదటిసారి కలిసి నటిస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి ఇప్పుడు గూగుల్ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టేసింది. అదేంటంటే ఈ చిత్రానికి ఇద్దరు దర్శకత్వం వహిస్తున్నారట.
రాజమౌళితో పాటు సంజయ్ పటేల్ ఆర్ఆర్ఆర్‌కు దర్శకత్వం వహిస్తున్నట్లు గూగుల్ చెబుతోంది. ఆర్ఆర్ఆర్ అని గూగుల్‌లో సర్చ్ చేసినప్పుడు దర్శకుల దగ్గర వీరిద్దరి పేర్లు ఉండటం ఇప్పుడు అందరికీ షాక్‌ను కలిగిస్తోంది. ఇక్కడ మరో షాకింగ్ విషయమేంటంటే.. సంజయ్ పాటిల్ అనే దర్శకుడు సినీ ఇండస్ట్రీలో లేకపోవడం. ఆ పేరును గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు కర్ణాటకకు చెందిన ఓ ప్రముఖ పొలిటికల్ లీడర్ ఫొటోను చూపిస్తోంది. అంతేకాదండోయ్.. నిర్మాత స్థానంలో దానయ్య పేరుతో పాటు రంజీత్ సత్రే, ప్రసన్న డియోచకే పేర్లు కూడా కనిపిస్తుండటం విశేషం. దీంతో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌తో సాధారణ ప్రేక్షకులు కూడా షాక్‌కు గురౌతున్నారు. అయితే గూగుల్‌లో ఇలాంటి తప్పులు రావడం కొత్తేం కాదు. గతంలోనూ సినీ నటుడు బాలకృష్ణ పేరును సర్చ్ చేసినప్పుడు ఆయన మరణించినట్లుగా చూపించిన విషయం తెలిసిందే. అలాగే రాజమౌళి, దేవీ శ్రీ ప్రసాద్ ఇలా పలువురి గురించి వివరాలను గూగుల్ తప్పుగా చూపించింది.
కాగా ఫిక్షన్ కథాంశంతో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్ దేవగన్, అలియా భట్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.