AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్‌కి రియా ఇచ్చే మందులు హైడోసేజ్‌తో ఉండేవి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో రోజుకో విషయం బయటకు వస్తోంది. సుశాంత్‌ గురించి సన్నిహితులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు.

సుశాంత్‌కి రియా ఇచ్చే మందులు హైడోసేజ్‌తో ఉండేవి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 24, 2020 | 11:24 AM

Share

Sushant death case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో రోజుకో విషయం బయటకు వస్తోంది. సుశాంత్‌ గురించి సన్నిహితులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. కొందరేమో సుశాంత్‌ డిప్రెషన్‌తో బాధపడేవాడని అంటుంటే.. మరికొందరేమో వీటిని ఖండిస్తున్నారు. సుశాంత్‌కి ఎప్పటి నుంచో తెలిసిన వారు సైతం అతడు చాలా మంచివాడు, ధైర్యవంతుడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెబుతున్నారు. ఈ క్రమంలో సుశాంత్‌, రియా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్‌గా ఉండే ఓ స్నేహితురాలు పలు కీలక విషయాలు వెల్లడించింది. తాను సుశాంత్, రియా చేసుకునే పార్టీలకు వెళ్లే దాన్ని అని ఆమె అన్నారు.

సుశాంత్‌లో ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న విషయాన్ని రియానే చెప్పిందని ఆమె పేర్కొన్నారు. సుశాంత్ ఇంట్లో పనిచేసే సిబ్బంది సైతం ఇంట్లో ఎవరో ఉన్నట్లు తనతో చెప్పారని.. కానీ తానకైతే ఎప్పుడు అలా అనిపించలేదని ఆమె వెల్లడించారు. ఈ విషయంపై సుశాంత్ కూడా తనను ఓ సారి అడిగాడని గుర్తు చేసుకున్నారు. తన ఆరోగ్యం సరిగా లేక కొద్ది రోజులుగా తాను అక్కడికి వెళ్లలేదని ఆమె తెలిపారు.

ఇక సుశాంత్‌కి ఎప్పుడైనా బాలేదని తెలిస్తే.. రియా తన తండ్రి(డాక్టర్)ని అడిగేదని, ఆయన రాసిచ్చిన యాంటీబయోటిక్‌లను రియా, సుశాంత్‌కి ఇచ్చేదని ఆమె వెల్లడించారు. అయినా నటుడి ఆరోగ్యం ఏం కుదుటపడేది కాదని ఆమె తెలిపారు. తనకు బాలేకపోవడం వలనే సుశాంత్ తరచుగా ఇబ్బంది పడేవాడని, అతడికి ఇచ్చే మెడిసిన్లు కూడా హై డోసేజ్‌తో ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఇక ఆర్థికంగా, కెరీర్ పరంగా సుశాంత్‌ విషయాలను రియానే చూసుకునేదని ఆమె అన్నారు. ఇక ఆ ఇద్దరు రిలేషన్‌లో మంచిగా ఉండేవారని, ఇలా ఎందుకు జరిగిందన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉందని ఆ స్నేహితురాలు తెలిపారు. అయితే జూన్ 14న సుశాంత్ ముంబయిలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. ఇప్పుడు ఆ కేసును సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే.‌

Read More:

కరోనాతో మృతి చెందాడంటూ.. ఎన్నారై నుంచి 85వేలు వసూలు

హిందూ అక్కాచెల్లెళ్లను దత్తత తీసుకొని.. ముస్లిం భయ్యా నీకు హాట్సాఫ్

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు