Arjun Daughter : 14 ఏళ్ల ప్రేమ.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న అర్జున్ చిన్న కూతురు.. ఫోటోస్ వైరల్..
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడ హీరో అయినప్పటికీ తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. హీరోగానే కాకండా సహయ నటుడిగానూ మెప్పించాడు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. అయితే అర్జున్ పెద్ద కూతురు ఇప్పటికే సినీరంగంలోకి కథానాయికగా ఎంట్రీ ఇవ్వగా.. చిన్న కూతురు మాత్రం బిజినెస్ రంగంలో దూసుకుపోతుంది.

కన్నడ హీరో అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ఎన్నో హిట్ చిత్రాలలో కథానాయకుడిగా, సహయ నటుడిగా అలరించాడు. ఇప్పటికీ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. మరోవైపు అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య కథానాయికగా సినీరంగంలోకి తెరంగేట్రం చేసింది. అంతకు ముందే తమిళ నటుడు రామయ్య కుమారుడు హీరో ఉమాపతి రామయ్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహ వేడుకకు స్టార్ హీరోహీరోయిన్స్, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇక తాజాగా అర్జున్ చిన్న కూతురు అంజన సైతం వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గతంలోనే తన ప్రియుడు విదేశీయుడితో నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా ఈ నెల 19న వీరిద్దరి వివాహం విదేశాల్లోనే జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Balakrishna: బాలకృష్ణకు లవర్‌గా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఒకే ఒక్కడు, హానుమాన్ జంక్షన్, శ్రీఆంజనేయం వంటి హిట్ చిత్రాలతో పాపులర్ అయ్యారు. కన్నడలో అనేక చిత్రాల్లో నటించిన ఈ హీరో.. ఇప్పుడు సహయ నటుడిగా మెప్పిస్తున్నారు. 1988లో నటి నివేదితను వివాహం చేసుకున్నారు అర్జున్. వీరికి ఐశ్వర్య, అంజన అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. తండ్రి బాటలోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన పెద్ద కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది.
ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..
ఇక అర్జున్ చిన్న కూతురు విషయానికి వస్తే.. అర్జున్ చిన్న కూతురు అంజన సర్జా వరల్డ్ పేరుతో ఓ స్టార్టప్ కంపెనీ స్థాపించి బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు. అమెరికాలో చదువుకుంటున్న సమయంలోనే ఇసాయ్ నట్టర్ అనే కుర్రాడితో ప్రేమలో పడింది. ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల ప్రేమను వైవాహిక బంధంలోకి తీసుకెళ్లింది. వీరిద్దరి పెళ్లి ఫోటోస్ ప్రస్తుతం వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‌తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..
అర్జున్ చిన్న కూతురు..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Idupu Kayitham: ఇడుపు కాయితం నుంచి గడప సాంగ్ రిలీజ్.. ప్రతి అమ్మాయి హృదయాలను హత్తుకునే పాట..
