AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాకబ్ అండ్ కో ‘శ్రీ రామచంద్ర’ వాచ్.. ధర అక్షరాలా రూ. 4.25 కోట్లు! ప్రత్యేకతలు ఇవే

Jacob and Co Shri Ramchandra Watch: ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ వాచ్ బ్రాండ్ జాకబ్ & కో ‘శ్రీ రామచంద్ర’ పేరుతో ప్రత్యేక వాచ్‌ను పరిచయం చేసింది. శ్రీరాముడు, హనుమంతుడు, అయోధ్య రామ మందిరం ప్రతిరూపాలతో రూపొందించిన ఈ వాచ్ ధర సుమారు రూ. 4.25 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు వాచ్‌లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

జాకబ్ అండ్ కో ‘శ్రీ రామచంద్ర’ వాచ్.. ధర అక్షరాలా రూ. 4.25 కోట్లు! ప్రత్యేకతలు ఇవే
Shri Ramchandra Watch
Rajashekher G
|

Updated on: Oct 25, 2026 | 1:48 PM

Share

Jacob and Co Shri Ramchandra Watch: ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ వాచ్ బ్రాండ్ జాకబ్ & కో (Jacob & Co) మరో అరుదైన వాచ్‌ను పరిచయం చేసింది. ‘శ్రీ రామచంద్ర’ (Shri Ramchandra) పేరుతో రూపొందించిన ఈ ప్రత్యేక వాచ్‌లో శ్రీరాముడు, హనుమంతుడు, అయోధ్యలోని రామ మందిరం ప్రతిరూపాలను అందంగా తీర్చిదిద్దారు. ఆధ్యాత్మికతకు ఆధునిక వాచ్ తయారీ కళను జోడించి రూపొందించిన ఈ విలాసవంతమైన వాచ్ ప్రస్తుతం వాచ్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. దీని ధర సుమారు రూ. 4.25 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు వాచ్‌లను మాత్రమే తయారు చేయనున్నారు.

అత్యంత అరుదైన ‘శ్రీ రామచంద్ర’ ఎడిషన్

జాకబ్ & కోకు చెందిన ప్రసిద్ధ ఆస్ట్రోనోమియా సోలార్ (Astronomia Solar) మోడల్ ఆధారంగా ఈ వాచ్‌ను రూపొందించారు. ఇంతకుముందు సంస్థ పరిచయం చేసిన ‘ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి’ వాచ్‌కు లభించిన ఆదరణ నేపథ్యంలో, ఈ కొత్త ఎడిషన్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటంతో కలెక్టర్లకు ఇది విలువైన వాచ్‌గా నిలవనుంది.

ఇవి కూడా చదవండి

వాచ్‌లో శ్రీరాముడు, హనుమంతుడి ప్రతిరూపాలు

ఈ వాచ్‌లోని డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. డయల్‌పై 6 గంటల స్థానంలో శ్రీరాముడు, 9 గంటల స్థానంలో హనుమంతుడి ప్రతిరూపాలను ఏర్పాటు చేశారు. వీరిద్దరి మధ్య నీలి రంగులో కనిపించే భూమి తన అక్షంపై తిరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి నిమిషానికి ఒకసారి పూర్తి భ్రమణం చేస్తూ సెకన్ల సూచికగా పనిచేస్తుంది.

కాషాయ రంగులో అద్భుతమైన డిజైన్

హిందూ సంప్రదాయంలో పవిత్రతకు ప్రతీకగా భావించే కాషాయ రంగుకు ఈ వాచ్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. నారింజ రంగు ఫైర్ ఓపల్ డయల్‌పై రోజ్ గోల్డ్ ముళ్లు గంటలు, నిమిషాలను సూచిస్తాయి. డయల్ మధ్యలో సూర్యుడికి ప్రతీకగా నారింజ రంగు క్యూబిక్ జిర్కోనియా రాయిని అమర్చారు. అయోధ్య రామ మందిరం ప్రతిరూపంతో పాటు, మండల నమూనా కలిగిన నీలి రంగు నియోరాలైట్ పీఠం ఈ వాచ్‌కు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి.

సాంకేతిక ప్రత్యేకతలు, ధర ఎంత?

ఈ లగ్జరీ వాచ్‌లో జాకబ్ & కో స్వయంగా రూపొందించిన మాన్యువల్ వైండింగ్ క్యాలిబర్ JCAM42 మెకానిజాన్ని ఉపయోగించారు. ఇందులో మొత్తం 295 భాగాలు ఉండగా, 48 గంటల పవర్ రిజర్వ్ అందిస్తుంది. రోజ్ గోల్డ్ కేస్‌బ్యాక్‌పై ఉన్న రెండు బోల్స్ ద్వారా వాచ్‌కు వైండింగ్ చేయడంతో పాటు సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. వెనుక భాగంలో ప్రత్యేకంగా ‘జై శ్రీ రామ్’ ప్లేట్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఈ ‘శ్రీ రామచంద్ర’ ఎడిషన్ ధర సుమారు రూ. 4.25 కోట్లు (510,000 డాలర్లు)గా పేర్కొనబడింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు పీసులు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. గతంలో వచ్చిన ‘ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి’ వాచ్‌ల ధరలు మోడల్‌ను బట్టి సుమారు రూ. 35.88 లక్షల నుంచి రూ. 1.08 కోట్ల వరకు ఉన్నాయి.

ఆధ్యాత్మిక విశ్వాసం, అద్భుతమైన కళాత్మకత, అత్యాధునిక వాచ్ తయారీ సాంకేతికత కలయికగా రూపొందిన ఈ వాచ్ లగ్జరీ వాచ్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది.

వాచ్ వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by JACOB & CO. (@jacobandco)

Follow Us