AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుక్క నీరు వృథా చేసినా చుక్కలు కనిపిస్తాయ్..! ఇకనైనా జాగ్రత్త.. జలమండలి వార్నింగ్!

హైదరాబాద్‌లో నీటి నిల్వలు తగ్గుతుండటంతో జలమండలి నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాగునీటిని వాహనాలు కడగడానికి, ఇంటి పరిసరాలను శుభ్రం చేయడానికి వృథా చేస్తే జరిమానాలు విధించే అవకాశం ఉంది. సింగూరు, మంజీర రిజర్వాయర్లలో తగ్గుతున్న నీటి నిల్వల నేపథ్యంలో ప్రతి బొట్టును జాగ్రత్తగా వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Oct 25, 2026 | 1:22 PM

Share
హలో.. హైదరాబాదీ.. కార్లు, బైకులు కడుగుతున్నావా.. భారీ ఫైన్లు తప్పవు.. ఇంటి ముందు నీళ్లు వృధాగా పోనిస్తున్నావా.. భారీ జరిమానా పడినట్టే.. చుక్క నీటిని వృథా చేసినా.. చుక్కలు కనిపించేలా పెనాల్టీలు తప్పవు.  స్వయంగా.. హైదరాబాద్ జలమండలి చేస్తున్న హెచ్చరికలివి.. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్ర నీటి కష్టాలు తప్పవు. అందుకే.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ముందస్తుగా అలర్ట్ జారీ చేసింది.

1 / 6
నగరంలో నీటి సమస్యను ఎదుర్కోవాలంటే పొదుపే ప్రధాన మార్గమంటోంది హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డ్.. ప్రతి బొట్టునూ జాగ్రత్తగా వాడాలి. నీటిని వృథా చేశారో.. గొంతు తడుపుకోవడానికి కూడా నీళ్లు దొరికే పరిస్థితి ఉండదని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ సిటీలోని ప్రతి గల్లీలో సౌండ్ బాక్సులతో నీటి వినియోగంపై అవగాహన కల్పించేలా చాటింపు వేయిస్తోంది అధికార యంత్రాంగం. నిన్నటి నుంచే విస్తృతంగా ప్రచారం చేస్తోంది హైదరాబాద్ జలమండలి.

2 / 6
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నీటి కొరత తీవ్రంగా ఉంది. ప్రధాన రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్న పరిస్థితి. హైదరాబాద్‌కు నీళ్లందించే సింగూరు, మంజీర రిజర్వాయర్లలో నీరు అడుగంటిన పరిస్థితి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోనూ నీటి నిల్వలు రోజు రోజుకూ తగ్గుతుండటం ఆందోళన కలిగించే అంశం.

3 / 6
దీనికి తోడు వర్షపాతం సరిగా లేక భూగర్భ జలాలు మరింత లోతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ పరిస్థితుల్లో రానున్న రోజులు తాగునీటికి తీవ్ర ఇబ్బంది కరమైన పరిస్థితులు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

4 / 6
అందులో భాగంగా ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. అవగాహన కల్పిస్తున్నారు. అప్పటికీ మారకపోతే భారీగా ఫైన్లు వేసేందుకూ సిద్ధమవుతున్నారు అధికారులు.

5 / 6
ముఖ్యంగా బైకులు, కార్లు కడుగుతూ నీళ్లు వృధా చేసినా, ఇంటి ముందు నీళ్లు వృధాగా పోనిచ్చినా భారీ జరిమానా విధించనున్నట్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సేవ్ వాటర్ అనే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో.. జలమండలి ప్రచారం మొదలయ్యింది.

6 / 6
Follow Us
చుక్క నీటిని వృథా చేసినా.. చుక్కలు కనిపించేలా పెనాల్టీలు తప్పవు

ఈఎంఐలు చెల్లించేవారికి బ్యాడ్ న్యూస్..!
ఈఎంఐలు చెల్లించేవారికి బ్యాడ్ న్యూస్..!
మరణించిన వారి ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారు? దీని వెనుక..

చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ అద్భుత లాభాలు.. మెరిసే చర్మానికి

భూగర్భ జలాన్ని పీల్చేస్తున్న ముఠాపై హైడ్రా ఉక్కుపాదం

పౌర్ణమి నుంచి వీరికి దశ తిరిగే ఛాన్స్..లిస్ట్‌లో మీ రాశి ఉందా?

వైభవ్ సూర్యవంశీకి నంబర్ 3 సెట్ కాదు.. అశ్విన్ వార్నింగ్

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్నాచెల్లెళ్లు మృతి

16 వేల అడుగుల ఎత్తులో ఆకస్మికంగా పీరియడ్స్..శానిటరీ ప్యాడ్స్ లేవు

ఈ చిత్రంలో మీరు మొదట ఏం చూశారు? పెంగ్వినా.. మనిషి ముఖమా?..