నిన్ను జీవితాంతం ప్రేమిస్తుంటా: సుశాంత్‌పై రియా ఎమోషనల్ పోస్ట్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ మరణించి ఇవాళ్టికి సరిగ్గా నెల రోజులు అవుతోంది. గత నెల 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు.

నిన్ను జీవితాంతం ప్రేమిస్తుంటా: సుశాంత్‌పై రియా ఎమోషనల్ పోస్ట్‌
Follow us

| Edited By:

Updated on: Jul 14, 2020 | 12:23 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ మరణించి ఇవాళ్టికి సరిగ్గా నెల రోజులు అవుతోంది. గత నెల 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. అయితే ఆయన మృతిని అటు సన్నిహితులు, ఇటు అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌, నటి రియా చక్రవర్తి తన సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్‌ను పెట్టారు.

”నా భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నా. నా హృదయంలో ఎవరూ పూరించని శూన్యత నెలకొంది. ప్రేమ మీద నువ్వు నాకు నమ్మకాన్ని కలిగించావు. ఓ చిన్న మ్యాథమేటికల్ ఈక్వెషన్‌ ద్వారా మన జీవితాన్ని అర్థం చేసుకునే విధానాన్ని నువ్వు నాకు నేర్పించావు. నేను నీ దగ్గర రోజు నేర్చుకుంటా అని ప్రామిస్ చేశా. నువ్వు లేవన్న విషయాన్ని నేను మాటల్లో చెప్పలేను. ఇప్పుడు నువ్వు చాలా ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్నావని అనుకుంటున్నా. చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీ ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్తకు సాదరంగా స్వాగతం పలికి ఉంటాయి. నిన్ను మళ్లీ నా దగ్గరకు పంపాలని నేను కోరుకుంటా.

నువ్వు చాలా అందమైన వ్యక్తివి. ప్రపంచం చూసిన ఓ అద్భుతానివి. మన మధ్య ఉన్న ప్రేమను చెప్పేందుకు నాకు మాటలు సరిపోవడం లేదు. మన మధ్య ఉన్న ప్రేమను నువ్వు కూడా నాకు చాలా సార్లు చెప్పావు. ప్రశాంతంగా ఉండు సుశీ. నిన్ను కోల్పోయి 30 రోజులు అవుతుంది. కానీ జీవితాంతం నిన్ను ప్రేమిస్తుంటా” అని కామెంట్ పెట్టారు. ఈ సందర్భంగా సుశాంత్‌తో తాను తీసుకున్న ఫొటోలను రియా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

https://www.instagram.com/p/CCnBR95HAmO/?utm_source=ig_embed

Latest Articles
నంద్యాల జిల్లాలో వర్షం, వడగండ్ల వాన బీభత్సం.. పక్షులు విలవిల
నంద్యాల జిల్లాలో వర్షం, వడగండ్ల వాన బీభత్సం.. పక్షులు విలవిల
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే