బాపు గెటప్‌లో వర్మ: షాక్‌ అవుతోన్న నెటిజన్లు..!

నిత్యం ఏదో ఒక వివాదాలకు పురుడు పోసే వ్యక్తి.. డైరెక్టర్ ఆర్జీవీ అని చెప్పవచ్చు. ఏ విషయంపైనైనా.. స్పందించడంలో ముందుండే వ్యక్తి. ఈ మధ్యనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీసీ పలు వివాదాలకు ఆజ్యం పోశారు. తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. అక్టోబర్ గాంధీ జయంతిని పురస్కరించుకుని.. ఓ తాజా.. ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ. తన ఫేస్‌ను.. గాంధీ ఉన్న రూపంలో.. ఫొటో మార్ఫింగ్ చేసి.. ‘అతనిలో […]

బాపు గెటప్‌లో వర్మ: షాక్‌ అవుతోన్న నెటిజన్లు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 02, 2019 | 1:45 PM

నిత్యం ఏదో ఒక వివాదాలకు పురుడు పోసే వ్యక్తి.. డైరెక్టర్ ఆర్జీవీ అని చెప్పవచ్చు. ఏ విషయంపైనైనా.. స్పందించడంలో ముందుండే వ్యక్తి. ఈ మధ్యనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీసీ పలు వివాదాలకు ఆజ్యం పోశారు. తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. అక్టోబర్ గాంధీ జయంతిని పురస్కరించుకుని.. ఓ తాజా.. ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ.

తన ఫేస్‌ను.. గాంధీ ఉన్న రూపంలో.. ఫొటో మార్ఫింగ్ చేసి.. ‘అతనిలో నేను దాగి ఉన్నానని నాకు తెలియదు.. హ్యాపీ మై జయంతి’ అని ట్వీట్ చేశారు. కాగా.. బాపు రూపంలో ఆర్జీవీ ఉన్న ఫొటోను చూసి.. నెటిజన్లు ఫుల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఆయనకు అనుకూలంగా.. మరికొంత మంది.. గాంధీని ఇన్సల్ట్‌ చేయొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే ఫుల్‌గా వైరల్ అవుతోంది.