‘సైరా’కు అదేనా మైనస్..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌ను హీరో రామ్ చరణ్ దాదాపు 280 కోట్ల వ్యయంతో నిర్మించాడు. గాంధీ జయంతి కానుకగా తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఇవాళ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. […]

'సైరా'కు అదేనా మైనస్..?
Follow us

|

Updated on: Oct 02, 2019 | 6:19 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌ను హీరో రామ్ చరణ్ దాదాపు 280 కోట్ల వ్యయంతో నిర్మించాడు. గాంధీ జయంతి కానుకగా తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఇవాళ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అయితే కొద్ది చోట్ల ఈ సినిమాకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవ్వడం గమనార్హం. దీనితో ‘సైరా’ కూడా దాదాపు ‘సాహో’ బాట పట్టేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా మూవీ‌గా రిలీజయ్యింది ‘సాహో’. అయితే కథ, కథనంలో చాలా కన్ఫ్యూషన్ ఉండటంతో ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. కానీ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌తో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ నష్టపోకుండా కలెక్షన్స్ రాబట్టగలిగింది. సరిగ్గా ఇదే పరిస్థితి ‘సైరా’కు పునరావృత్తం అయ్యేలా కనిపిస్తోంది.
స్వాతంత్ర్య సమరయోధుడి కథతో రూపొందిన ‘సైరా’కు మొదటి భాగం మైనస్ అనే టాక్ వినిపిస్తోంది. పార్టులు పార్టులుగా సాగుతూ.. ఎక్కువ సాగతీత సన్నివేశాలు ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను దృష్టిలో పెట్టుకుని చిరు స్టార్‌డమ్, మాస్ ఇమేజ్ దృష్ట్యా కొన్ని సీన్స్ తెరకెక్కించాడు దర్శకుడు. అవి కాస్తా లాజిక్‌కు దూరంగా ఉంటాయి. ఇక కొన్ని సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉన్నప్పటికీ.. చరిత్ర గురించి చెప్పే సినిమా కావడంతో ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాలి. తెలుగులో ఎలాగైనా చిరుకు తిరుగులేదు. టాక్ గురించి పెద్దగా పట్టింపు ఉండదు. వారంలోనే దాదాపు కలెక్షన్స్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే మిగతా భాషల్లో మాత్రం ఇదే సీన్ రిపీట్ అవ్వడం కష్టం. మిగిలిన తారాగణం మీద ఆధారపడే ఈ సినిమా వసూళ్లు సాగుతాయి.
171 నిమిషాల నిడివితో సాగిన ఈ చిత్రం ల్యాగ్ ఎక్కువ‌ కావ‌డంతో కొన్ని సీన్స్‌ను కూడా క‌ట్ చేసిన‌ట్లు దర్శకుడు సురేంద‌ర్‌రెడ్డి తెలిపాడు. పరభాషా నటులు వారివారీ పాత్రల్లో అద్భుతంగా నటించారు. వారం గడిచాక ఈ చిత్రం ఫైనల్ టాక్ యావరేజ్ అయినప్పటికీ కమర్షియల్‌గా వసూళ్లు ఏ మేరకు సాధిస్తుందో వేచి చూడాలి.

ప్రముఖ దినపత్రిక 'హిందీ మిలాప్‌' ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ కన్నుమూత
ప్రముఖ దినపత్రిక 'హిందీ మిలాప్‌' ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ కన్నుమూత
డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు.. కట్ చేస్తే..
డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు.. కట్ చేస్తే..
లోక్‌సభ ఎన్నికల బరిలోకి ముంబై మాజీ పోలీస్ కమిషనర్..?
లోక్‌సభ ఎన్నికల బరిలోకి ముంబై మాజీ పోలీస్ కమిషనర్..?
చెత్త ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ ఔట్?
చెత్త ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ ఔట్?
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్