సైరా తెచ్చిన ఆనందం.. తనయుడిని ముద్దాడిన తండ్రి..

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీ విడుదల కాకముందే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. కొన్ని వివాదాలు వచ్చినా.. సక్సస్ ఫుల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది. అన్ని చోట్ల నుంచి చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో చిరంజీవి, రామ్ చరణ్‌లు ఆనందంలో మునిగిపోయారు. ఇది చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు.. పైగా కొడుకే స్వయంగా నిర్మించడం.. అది మంచి హిట్ అందుకోవడంతో చిరు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భావోద్వేగానికి గురైన మెగాస్టార్.. తనయుడికి ముద్దు […]

సైరా తెచ్చిన ఆనందం.. తనయుడిని ముద్దాడిన తండ్రి..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 02, 2019 | 4:54 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీ విడుదల కాకముందే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. కొన్ని వివాదాలు వచ్చినా.. సక్సస్ ఫుల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది. అన్ని చోట్ల నుంచి చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో చిరంజీవి, రామ్ చరణ్‌లు ఆనందంలో మునిగిపోయారు. ఇది చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు.. పైగా కొడుకే స్వయంగా నిర్మించడం.. అది మంచి హిట్ అందుకోవడంతో చిరు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భావోద్వేగానికి గురైన మెగాస్టార్.. తనయుడికి ముద్దు ఇచ్చి సంతోషాన్ని తెలియజేశాడు. తొలి స్వాతంత్ర్య సమర యోధుడు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూలియస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , అమిత్ త్రివేది సంగీతం , ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ ల్యూస్, ఆర్ట్, కాస్ట్యూమ్ ఇలా అన్ని విభాగాలు స‌క్సెస్ కావ‌డంతో సినిమా మంచి హిట్ కొట్టింద‌ని చెబుతున్నారు. మరోవైపు సినిమా చూసిన ప్రేక్షకులు చిరంజీవి మరో సూపర్ హిట్‌ మూవీని తన ఖాతాలో వేసుకున్నారని చెబుతున్నారు.