మూడు ఎయిర్ పోర్టులకు ఉగ్ర భయం.. ఆరెంజ్ అలర్టే ఎందుకంటే..?

కశ్మీర్లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. కాశ్మీర్ తోపాటు పొరుగునే పాకిస్తాన్ బోర్డర్లో వున్న పంజాబ్ రాష్ట్రానికి కూడా ఉగ్ర ముప్పు పొంచి వుందని ఇంటెలిజెన్సు బ్యూరో వార్నింగ్ ఇవ్వడంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. రెండు రాష్ట్రాల పోలీసులను తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. శ్రీనగర్, పఠాన్ కోట్, అమృత్ సర్ ఎయిర్ పోర్టులపై ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని ఐబికి సమాచారం వుందన్నది తాజా హెచ్చరికల సారాంశం.  జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్ […]

మూడు ఎయిర్ పోర్టులకు ఉగ్ర భయం.. ఆరెంజ్ అలర్టే ఎందుకంటే..?
Follow us
Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 02, 2019 | 4:43 PM

కశ్మీర్లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. కాశ్మీర్ తోపాటు పొరుగునే పాకిస్తాన్ బోర్డర్లో వున్న పంజాబ్ రాష్ట్రానికి కూడా ఉగ్ర ముప్పు పొంచి వుందని ఇంటెలిజెన్సు బ్యూరో వార్నింగ్ ఇవ్వడంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. రెండు రాష్ట్రాల పోలీసులను తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. శ్రీనగర్, పఠాన్ కోట్, అమృత్ సర్ ఎయిర్ పోర్టులపై ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని ఐబికి సమాచారం వుందన్నది తాజా హెచ్చరికల సారాంశం.  జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్ లో ఆత్మాహుతి దాడులకు కుట్ర పన్నుతోందని సమాచారం. ఐబి హెచ్చరికలతో సీఐఎస్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. శ్రీనగర్, పఠాన్ కోట్, అమృత్ సర్, జమ్మూ ఎయిర్ పోర్టులతోపాటు ఎయిర్ బేస్ ల దగ్గర భారీ బలగాలను మోహరించి సెక్యూరిటీని టైటెన్ చేశారు. పది మంది ఆత్మాహుతి దాడుల బృందం ఇప్పటికే జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లోకి ఎంటర్ అయ్యిందని ఐబి భావిస్తోంది. సమాచారం పక్కాగా వుండడంతో పంజాబ్, కశ్మీర్, జమ్మూ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీనగర్, అవంతీపూర్, జమ్మూ, పఠాన్ కోట్, హిండన్ ఎయిర్ బేస్ ల సమీప ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఆరెంజ్ అలర్టే ఎందుకు ?
రెడ్ అలర్ట్ ప్రకటించే ముందుు చివరి విడతగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. ఒకేసారి రెడ్ అలర్ట్ ప్రకటిస్తే ఆయా ప్రాంతాల్లో స్కూళ్ళు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయాల్సి వస్తుంది.. దాంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్న ఉద్దేశంతో చివరి దశలో మాత్రమే రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు.