లిక్కర్ దందాపై బాబు ఫైర్.. ఏమన్నారంటే..?
గాంధీజయంతి రోజు మద్యం వ్యాపారం చేయడం ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ ఫైట్ కు తెరలేపింది. ఒకవైపు దశల వారీగా మధ్యనిషేధం అమల్లోకి తెస్తామని చెబుతున్న జగన్ ప్రభుత్వం ఏకంగా గాంధీ జయంతి రోజున మధ్య విక్రయాలు కొనసాగిస్తోందని, ఈ విధంగా చేయడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇద్దామనుకుంటున్నారని విపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు వ్యాఖ్యలతో టిడిపి, వైసీపీల మధ్య మాటల యుద్దం మొదలైంది. గాంధీ జయంతి రోజుల అన్ని ప్రాంతాల్లో మద్యం షాపులను మూసివేస్తారని.. […]
గాంధీజయంతి రోజు మద్యం వ్యాపారం చేయడం ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ ఫైట్ కు తెరలేపింది. ఒకవైపు దశల వారీగా మధ్యనిషేధం అమల్లోకి తెస్తామని చెబుతున్న జగన్ ప్రభుత్వం ఏకంగా గాంధీ జయంతి రోజున మధ్య విక్రయాలు కొనసాగిస్తోందని, ఈ విధంగా చేయడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇద్దామనుకుంటున్నారని విపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు వ్యాఖ్యలతో టిడిపి, వైసీపీల మధ్య మాటల యుద్దం మొదలైంది. గాంధీ జయంతి రోజుల అన్ని ప్రాంతాల్లో మద్యం షాపులను మూసివేస్తారని.. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు విభిన్నంగా ఉందని మండిపడ్డారు. గాంధీ జయంతి రోజునే మద్యం షాపులను నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు చంద్రబాబు. చట్టాలను చుట్టాలుగా మార్చుకొని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని జగన్‌పై ధ్వజమెత్తారు చంద్రబాబు. ఏపీ జగన్ జాగీరు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్టీయార్ అమల్లోకి తెచ్చిన మధ్యనిషేధానికి తూట్లు పొడిచి, లిక్కర్ మాఫియాతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను మధ్యం మత్తులో ముంచెత్తింది చంద్రబాబు కాదా అని వైసీపీ నేతలు ఎదురు దాడి ప్రారంభించారు. మంచిని మంచిగా, చెడును చెడుగా చూడలేని ప్రతిపక్ష నేత ఉండడం దౌర్భాగ్యమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును ఘాటుగా విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అమలు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాలకు చంద్రబాబు దురుద్దేశాలను ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. మహాత్ముని 150వ జయంతిని పురస్కరించుకొని.. గ్రామ సచివాలయాలు ప్రారంభిస్తున్న వేళ.. చంద్రబాబు పాలనకు వైఎస్ జగన్ పాలనకు మధ్య తేడాలను చూపిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సీదిరి అప్పలరాజు, శెట్టి ఫల్గుణ, శ్రీదేవి, ఎండీ అబ్దుల్ హఫీజ్ ఖాన్‌లు సంయుక్తంగా బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి ఏపీలో చంద్రబాబు వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ ను పెంచాయి.