AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలిమినేషన్: ఈసారి టఫ్ ఫైట్: వెళ్లేది ఎవరో..?

బిగ్‌బాస్ ఇచ్చిన ‘రాళ్లే రత్నాలు’ టాస్క్‌లో.. ఈ వారం నలుగురు నామినేషన్‌ అయ్యారు. వరుణ్ సందేశ్, మహేష్‌, ప్రేమజంట పునర్నవి, రాహుల్‌లు నామినేట్ అయ్యారు. చివరిగా టాస్క్‌లో.. బాబా మాస్టర్, వితిక, శివజ్యోతిలు, ఆలీలు విన్‌ అయ్యారు. అయితే.. ఇప్పుడు ఈ నలుగురు ఇంటి సభ్యుల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. వీరందరిలో.. ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారో అని సస్పెన్స్ . బిగ్‌బాస్ స్టార్ట్ చేసి.. ఇప్పటికి 12వ వారం నడుస్తోంది. ఇంకా 5 […]

ఎలిమినేషన్: ఈసారి టఫ్ ఫైట్: వెళ్లేది ఎవరో..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 02, 2019 | 1:07 PM

Share

బిగ్‌బాస్ ఇచ్చిన ‘రాళ్లే రత్నాలు’ టాస్క్‌లో.. ఈ వారం నలుగురు నామినేషన్‌ అయ్యారు. వరుణ్ సందేశ్, మహేష్‌, ప్రేమజంట పునర్నవి, రాహుల్‌లు నామినేట్ అయ్యారు. చివరిగా టాస్క్‌లో.. బాబా మాస్టర్, వితిక, శివజ్యోతిలు, ఆలీలు విన్‌ అయ్యారు. అయితే.. ఇప్పుడు ఈ నలుగురు ఇంటి సభ్యుల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. వీరందరిలో.. ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారో అని సస్పెన్స్ . బిగ్‌బాస్ స్టార్ట్ చేసి.. ఇప్పటికి 12వ వారం నడుస్తోంది. ఇంకా 5 వారాలు ఉన్నా.. 10 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. కింగ్ నాగార్జున అన్నట్టు.. ఒక్కోసారి డబుల్ ఎలిమినేషన్స్‌ కూడా ఉంటాయన్నారు. మరి ఈ వారం ఒకరా..? ఇద్దరో!! బిగ్‌‌బాస్ హౌస్‌ నుంచి బయటకు వెళ్లబోతున్నారనేది ఆసక్తిగా మారింది.

bigg boss 3: Mahesh vitta might get eliminated from house

మహేష్‌: బిగ్‌బాస్ సీజన్ 3 స్టార్ట్ చేసినప్పటి నుంచీ.. మహేష్ ఎలిమినేషన్‌లో ఉంటూ.. సేవ్ అవుతూ వస్తున్నాడు. మహేష్‌పై కాస్త.. నెగిటివ్‌ నెస్ ఉన్నప్పటికీ.. తన వాక్‌ చాత్యుర్యంతో ఇప్పటివరకూ సేవ్ అవుతూ వచ్చాడు. కానీ.. ఈసారి.. ఎలిమినేషన్‌లో వరుణ్ కూడా ఉన్నాడు. అతని కూడా మంచి స్టార్‌డమ్ ఉన్న కంటెస్టెంట్.

వరుణ్ సందేశ్: గేమ్‌ని గేమ్‌లా ఆడుతూ.. మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌‌గా హౌస్‌లో ఉన్నాడు వరుణ్ సందేశ్. అందరితోనూ.. కూల్‌గా ఉంటూ.. ఎలాంటి గొడవలకు పోకుండా చలా మంచిగా హ్యాండిల్ చేస్తున్నాడు వరుణ్. ఎలిమినేషన్‌లోకి రెండు, మూడు సార్లు వచ్చినా.. సేవ్ అయ్యాడు. అలాగే.. మరో ప్లస్ పాయింట్ ఏంటంటే.. హౌస్‌లో సభ్యులందరికీ వరుణ్ గుడ్ ఫ్రెండ్‌గా ఉన్నాడు. అప్పుడప్పుడు కొన్ని తగాదాలు వచ్చినా.. వెంటనే వాటిని శాల్వ్ చేస్తూ వచ్చాడు.

Bigg Boss 3: Rahul Sipligunj And Punarnavi Bhupalam Interesting Chit Chat

పునర్నవి: హౌజ్‌లో అందరికంటే చిన్నదైన పునర్నవి ఇప్పటివరకూ అంత యాక్టివ్‌గా లేదు. ఎప్పుడూ.. తన టెంపర్‌తో వివాదాలకు పురుడు పోస్తూ ఉంటుంది. అటు రొమాన్స్.. ఇటు టెంపర్ రెండూ.. ఆమెకు పెద్ద మైనస్ పాయింట్స్ అనే చెప్పాలి. ఇప్పటికి చాలా సార్లు ఆమె ఎలిమినేషన్‌కు నామినేట్ అయినా.. సేవ్ అవుతూ వచ్చింది. కానీ.. ఈసారి మాత్రం ఆమె ఎలిమినేషన్ ఫిక్స్ అయినట్టే అనిపిస్తోంది.

Bigg Boss 3: Punarnavi kisses Rahul, Social Media is busy with memes

రాహుల్: టాలీవుడ్ సింగర్‌గా రాహుల్‌కు మంచి పేరే ఉంది. హౌస్‌లో రాహుల్‌కి ప్లస్ పాయింట్స్ కంటే.. మైనస్ పాయింట్స్‌నే ఎక్కువగా ఉన్నాయి. అటు.. పునర్నవితో రొమాన్స్.. అనుచితంగా మాట్లాడటం, అతని బిహేవియర్.. ఇవన్నీ చూస్తే.. ఈసారి రాహుల్ ఔట్‌ అయినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది. ఇప్పటికే.. బిగ్‌బాస్ అతనితో ఓ గేమ్ ప్లాన్‌ చేశాడు.