అక్కడ గాలిపీలిస్తే అంతే సంగతులు.. అది కూడా ఇక్కడే..!

ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా కొన్ని లక్షల మంది కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. మనిషికి ఒక్కసారి ఈ వ్యాధి వచ్చినవారు బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి ప్రమాదకర వ్యాధి.. గాలి కాలుష్యంతో కూడా వస్తుంది. మనం పీల్చే గాలిలో రసాయనాలు కలిస్తే అది విష వాయువుగా మారుతుంది. అప్పుడు ఆ గాలి పీల్చిన వాళ్లు కూడా అస్వస్థతకు గురై.. కేన్సర్ బారిన పడతారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఓ మూడు ప్రాంతాల్లో కంపెనీలు […]

అక్కడ గాలిపీలిస్తే అంతే సంగతులు.. అది కూడా ఇక్కడే..!
Follow us

| Edited By:

Updated on: Oct 02, 2019 | 2:57 PM

ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా కొన్ని లక్షల మంది కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. మనిషికి ఒక్కసారి ఈ వ్యాధి వచ్చినవారు బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి ప్రమాదకర వ్యాధి.. గాలి కాలుష్యంతో కూడా వస్తుంది. మనం పీల్చే గాలిలో రసాయనాలు కలిస్తే అది విష వాయువుగా మారుతుంది. అప్పుడు ఆ గాలి పీల్చిన వాళ్లు కూడా అస్వస్థతకు గురై.. కేన్సర్ బారిన పడతారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఓ మూడు ప్రాంతాల్లో కంపెనీలు విడుదల చేసే విషవాయువులు గాలిలో కలుస్తున్నాయి. మొత్తం 34 రకాల కేన్సర్ కారక రసాయనాలు ఇందులో కలుస్తున్నాయి.

ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామికవాడ, రంగారెడ్డి జిల్లా కొత్తూరు, యాదాద్రి భువనగిరిలోని బొమ్మల రామారం ప్రాంతాలలోని పరిశ్రమల నుండి కేన్సర్ కారక రసాయనాలు వెలువడుతున్నాయని సమాచారం. ఈ ప్రాంతంలో ఉన్న పైరోలసిస్ పరిశ్రమల నుండి వెలువడుతున్నాయని తెలుస్తోంది. ఈ పైరోలసిస్ పరిశ్రమలో పాత టైర్లను రీసైక్లింగ్ చేస్తుంటారు. ఈ మూడు ప్రాంతాల్లో దాదాపు 60కి పైగా పైరోలసిస్ పరిశ్రమలు ఉన్నాయి.

పశ్చిమాసియా, బ్రిటన్, అమెరికాలో వాడిపాడేసిన టైర్లను రీసైక్లింగ్‌లో భాగంగా పైరోలసిస్ పరిశ్రమల్లో తగులబెడుతున్నారు. అయితే ఈ సమయంలో టైర్లను కాల్చిన సమయంలో వీటినుండి ప్రమాదకరమైన రసాయనాలు వెలువడుతున్నాయి. సోషల్ యాక్షన్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ పైరోలసిస్ పరిశ్రమల గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసింది. పైరోలసిస్‌ పరిశ్రమలపై సమగ్ర నివేదికను సమర్పించాలని సీపీసీబీని ఎన్జీటీ ఆదేశించింది. ఈ పరిశ్రమల్లో పాత టైర్లను కాల్చి ఓ రకమైన ద్రవాన్ని, రీసైక్లింగ్‌ రబ్బర్‌ను సేకరిస్తారు. ఆక్సిజన్‌ లేని రియాక్టర్లలో అధిక ఉష్ణోగ్రతల వద్ద మరిగిస్తారు. ఆ సమయంలో వచ్చే జిడ్డులాంటి ద్రవపదార్థాన్ని సేకరించి, దాని నుంచి ఆయిల్‌ను తయారు చేస్తారు. ఇది భారీ పరిశ్రమల్లోని బ్రాయిలర్లకు ఇంధనంగా ఉపయోగపడుతుంది.