జాన్వీ ‘కార్గిల్ గర్ల్’కి రిలీజ్ డేట్ ఫిక్స్
దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటించిన చిత్రం గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్. ఈ చిత్ర రిలీజ్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది.

దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటించిన చిత్రం గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్. ఈ చిత్ర రిలీజ్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది. ఆగష్టు 12న ఈ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని జాన్వీ తన సోషల్ మీడియాలో తెలిపారు. ‘ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ ఎయిర్‌ఫోర్స్ పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని మీ ముందుకు తీసుకు వస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఆమె జీవితం నాకు స్ఫూర్తిని ఇచ్చింది. మీకు కూడా స్ఫూర్తిని కలిగిస్తుందని భావిస్తున్నా. ‘గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గాళ్’ ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవ్వబోతుంది’ అని కామెంట్ పెట్టారు. ఈ సందర్భంగా మూడు పోస్టర్లను ఆమె తన సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
కాగా ఈ చిత్రంలో పంకజ్ త్రిపాది, అంగద్ బేడీ, మనవ్ విజ్, వినీత్ కుమార్ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కరణ్ జోహార్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
https://www.instagram.com/p/CCsI_mpAHL9/?utm_source=ig_embed



