అమితాబ్ స్పెషల్ పోస్ట్..ఆ 6 ర‌కాల వ్య‌క్తుల‌కు దూరంగా ఉండాల‌ని రిక్వెస్ట్..

క‌రోనా బారిన ప‌డిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ప్ర‌స్తుతం నానావ‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రజంట్ బిగ్ బి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, మ‌రో వారం రోజుల‌లో ఆయ‌న ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు.

అమితాబ్ స్పెషల్ పోస్ట్..ఆ 6 ర‌కాల వ్య‌క్తుల‌కు దూరంగా ఉండాల‌ని రిక్వెస్ట్..
Follow us

|

Updated on: Jul 16, 2020 | 1:47 PM

క‌రోనా బారిన ప‌డిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ప్ర‌స్తుతం నానావ‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రజంట్ బిగ్ బి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, మ‌రో వారం రోజుల‌లో ఆయ‌న్ను ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. ఇక అమితాబ్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఆరోగ్యానికి సంబంధించి అప్ డేట్స్ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంటున్నారు. ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా ఫేస్ బుక్ లో ఫ్యాన్స్ కోసం స్పెష‌ల్ పోస్ట్ పెట్టారు బిగ్ బి. 6 రకాల వ్యక్తుల నుండి దూరంగా ఉండమని కోరారు.

ఇతరులపై ఎప్పుడూ అసూయను వ్యక్తపరిచేవారు.. ఎదుటివ్య‌క్తు‌లపై ఎప్పుడూ అయిష్ట‌తను ప్ర‌ద‌ర్శించేవారు.. ఇతరుల‌పై ఎప్పుడూ అసంతృప్తిని చూపించేవారు.. ఎప్పుడూ కోపంతో ఊగిపోయేవారు… ఇత‌రుల‌ను ఎప్పుడూ అనుమానించేవారు… మ‌నుషుల్ని ఉన్న‌ట్టుండి వ‌దిలేసి వెళ్లేవారికి దూరంగా ఉండాల‌ని కోరారు. ఇటువంటివారు జీవితంలో ఉంటే దుఃఖం త‌ప్ప‌ద‌ని, సాధ్య‌మైనంత‌వ‌ర‌కు ఇలాంటి వ్య‌క్తుల్ని ఎవ‌రికి వారే కాపాడుకోవాల‌ని సూచించారు.

View this post on Instagram

*ईर्ष्यी घृणी त्वसंतुष्ट: क्रोधनो नित्यशड्कितः।* *परभाग्योपजीवी च षडेते दुखभागिनः।।* *अर्थात-* सभी से ईर्ष्या करने वाले, घृणा करने वाले, असंतोषी, क्रोधी, सदा संदेह करने वाले और पराये आसरे जीने वाले ये छः प्रकार के मनुष्य हमेशा दुखी रहते हैं। अतः यथा संभव इन प्रवृत्तियों से बचना चाहिए। They that express jealousy always towards others, they who ever dislike all others, they that remain dissatisfied, angered , they that are always and ever doubting .. and those who live off others .. these 6 kinds of individuals shall remain ever filled with sadness .. whenever possible we need to save ourselves from such trend setters ..

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on