Ravi Kishan: మనల్ని వాడుకోవడానికి చాలా మంది ఎదురుచూస్తారు.. రేసుగుర్రం విలన్ షాకింగ్ కామెంట్స్
తెలుగు సినీ పరిశ్రమలో విలన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవికిషన్. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి రాకముందు భోజ్ పురి, హిందీ చిత్రాల్లో నటించాడు. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు రవికిషన్.
టాలీవుడ్లో ఎక్కువ సినిమాల్లో నటించకపోయినా పవర్ఫుల్ పాత్రలతో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు రవి కిషన్. అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాతో విలన్ గా ప్రేక్షకులను మెప్పించారు. మద్దాలి శివారెడ్డి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. అలాగే తెలుగులో పలు సినిమాల్లో విలన్ గా చేసి ఆకట్టుకున్నాడు. రవి కిషన్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ సభ్యుడు. అలాగే నటుడిగా 450కి పైగా భోజ్‌పురి చిత్రాలలో నటించాడు. తాజాగా రవి కిషన్ మాట్లాడుతూ.. సినీ కెరీర్ లో సినీ కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న కొన్ని సమస్యల గురించి బయటపెట్టాడు. సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక విమర్శలు, వివాదాలకు కారణమైన కాస్టింగ్ కౌచ్‌ను తాను కూడా ఎదుర్కోవలసి వచ్చిందని షాకింగ్ విషయం చెప్పాడు
ఒక ఇంటర్వ్యూలో రవి కిషన్ మాట్లాడుతూ.. రవి కిషన్ బీహార్‌లోని ఒక గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. యుక్తవయసులో ఉండగానే ముంబైకి వచ్చానని చెప్పాడు. ఆసమయంలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని. అలాగే కొందరు తనను దోపిడీ చేసేందుకు ప్రయత్నించారని, రాజీకి సిద్ధపడకుండా ఆ దోపిడీలన్నింటిని తట్టుకుని నిలబడ్డానని చెప్పారు. యూట్యూబ్ ద్వారా శుభంగర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికిషన్ ఈ విషయాలను వెల్లడించారు.
“మీరు యవ్వనంగా, అందంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు. అలాగే మీ దగ్గర డబ్బు లేనప్పుడు కొందరు మిమ్మల్ని వాడుకోవాలని ప్రయత్నిస్తారు. సినీ పరిశ్రమలోనే కాదు అనేక రంగాల్లోనూ ఇదే జరుగుతోంది. అలాగే సినీ పరిశ్రమలో పురుషులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై ఆయన మాట్లాడారు. తన యవ్వనంలో తనను చాలా మంది దోపిడీ చేసేందుకు ప్రయత్నించారని కూడా వెల్లడించారు. స్లిమ్ గా, పొడవాటి జుట్టు, చెవి రింగులు ధరించి, ఆకర్షణీయంగా ఉండేవాడిని అని అన్నారు రవి కిషన్. “విజయానికి షార్ట్కట్లు లేవు. అలాంటి మార్గాలను అంగీకరించవద్దు. మీరు అంగీకరిస్తే, అది మీకు తరువాత అపరాధ భావం కలిగిస్తుంది” అని అన్నారు. షార్ట్ కట్స్ ద్వారా ఎవరూ పెద్ద స్టార్లు కాలేదని కూడా స్పష్టం చేశాడు. మీ సమయం వచ్చే వరకు ఓపిక పట్టండి. నా 90ల నాటి స్నేహితులు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ అందరూ సూపర్ స్టార్స్ అయ్యారు. నేను నా సమయం కోసం వేచి ఉన్నాను, ”అని అతను చెప్పాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి