‘నారా’లా ‘రానా’.. మారాడిలా..!

‘నారా’లా ‘రానా’.. మారాడిలా..!

‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌లో రెండో భాగమైన మహానాయకుడు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్ ప్రోమోలు, మేకింగ్ వీడియోలు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రానా పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో రానా.. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించగా.. ఆ పాత్ర కోసం అతడు ఎలా మారారో వీడియోలో చూపించారు. చంద్రబాబు మేనరిజం కోసం రానా ప్రాక్టిస్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 20, 2019 | 12:35 PM

‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌లో రెండో భాగమైన మహానాయకుడు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్ ప్రోమోలు, మేకింగ్ వీడియోలు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రానా పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ చిత్రంలో రానా.. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించగా.. ఆ పాత్ర కోసం అతడు ఎలా మారారో వీడియోలో చూపించారు. చంద్రబాబు మేనరిజం కోసం రానా ప్రాక్టిస్ చేస్తున్నట్లుగా కూడా అందులో చూపించారు. ఇక మొదటి భాగంలో రానా పాత్ర కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. రెండో భాగంలో కీలకంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటించగా.. విద్యా బాలన్, కల్యాణ్ రామ్, మంజిమా మోహన్, సచిన్ కేడ్కర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu