షూటింగ్‌లో శర్వానంద్‌, కాజల్.. లుక్ వైరల్

షూటింగ్‌లో శర్వానంద్‌, కాజల్.. లుక్ వైరల్

‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ కన్ఫర్మ్ అవ్వని ఈ చిత్రంలో శర్వా ద్విపాత్రాభినయంలో నటిస్తుండగా.. ఆయనతో కాజల్, కల్యాణి ప్రియదర్శన్ రొమాన్స్ చేయనున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతుండగా.. తాజాగా అందులో జాయిన్ అయ్యింది కాజల్ అగర్వాల్. వీరికి సంబంధించిన ఓ లుక్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో శర్వానంద్ పూర్తి గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపిస్తుండగా.. కాజల్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 20, 2019 | 11:57 AM

‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ కన్ఫర్మ్ అవ్వని ఈ చిత్రంలో శర్వా ద్విపాత్రాభినయంలో నటిస్తుండగా.. ఆయనతో కాజల్, కల్యాణి ప్రియదర్శన్ రొమాన్స్ చేయనున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతుండగా.. తాజాగా అందులో జాయిన్ అయ్యింది కాజల్ అగర్వాల్. వీరికి సంబంధించిన ఓ లుక్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అందులో శర్వానంద్ పూర్తి గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపిస్తుండగా.. కాజల్ తన కాజువల్ లుక్‌లో అదరగొడుతోంది. ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా.. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ తరువాత 96రీమేక్‌లో నటించనున్నాడు శర్వానంద్.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu