రానా Weds మిహీక: ఎంతమంది ఆహ్వానితులంటే!

హీరో రానా దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. రామానాయుడు స్టూడియోలో ఈ నెల 8న రానా-మిహీకల వివాహం జరగనుంది.

రానా Weds మిహీక: ఎంతమంది ఆహ్వానితులంటే!
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2020 | 3:43 PM

Rana Weds Miheeka: హీరో రానా దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. రామానాయుడు స్టూడియోలో ఈ నెల 8న రానా-మిహీకల వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మిహీక ఇంట మెహందీ కార్యక్రమం జరుగుతోంది. సంప్రదాయం ప్రకారం రానాను శుక్రవారం పెళ్లికొడుకును చేయనున్నారు. ఇక కరోనా నేపథ్యంలో రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీఆర్ కిట్స్ ద్వారా దగ్గర బంధువులను మాత్రమే ఇరు కుటుంబాలు ఆహ్వానించాయి. ఈ క్రమంలో రానా-మిహీకల వివాహానికి 35 మంది మాత్రమే హాజరుకానున్నారు. అంతేకాదు వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించామని సురేష్ బాబు తెలిపారు. మిగిలిన వారికి అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు.  ”ఈ పెళ్లిని ఘనంగా చేయాలని అనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకోవాలి” అని నిర్మాత వివరించారు. కాగా గత కొన్ని రోజులుగా రానా-మిహీకలు ప్రేమలో ఉన్నారు. వీరి వివాహానికి ఇరు వర్గాల పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన విషయం తెలిసిందే.

Read This Story Also: క్వారంటైన్‌ నుంచి రెండోసారి పారిపోయిన దంపతులు