AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదటిసారి మరో హీరోతో.. చెర్రీ క్రేజీ ప్లాన్..!

Ram Charan to produce star Hero: ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు నిర్మాతగానూ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి చిరు 152వ చిత్రాన్ని నిర్మిస్తోన్న చెర్రీ.. త్వరలో వరుసగా సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం చెర్రీ దగ్గర రెండు రీమేక్ సినిమాలు రెడీగా ఉన్నాయి. మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్, డ్రైవింగ్ లైసెన్స్ చిత్రాల రీమేక్ రైట్స్‌ను చెర్రీ కొనుగోలు చేశారు. […]

మొదటిసారి మరో హీరోతో.. చెర్రీ క్రేజీ ప్లాన్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 18, 2020 | 12:17 PM

Share

Ram Charan to produce star Hero: ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు నిర్మాతగానూ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి చిరు 152వ చిత్రాన్ని నిర్మిస్తోన్న చెర్రీ.. త్వరలో వరుసగా సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం చెర్రీ దగ్గర రెండు రీమేక్ సినిమాలు రెడీగా ఉన్నాయి. మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్, డ్రైవింగ్ లైసెన్స్ చిత్రాల రీమేక్ రైట్స్‌ను చెర్రీ కొనుగోలు చేశారు. ఇందులో భాగంగా లూసిఫర్‌ను చిరు కోసం పక్కన పెట్టిన చెర్రీ.. డ్రైవింగ్ లైసెన్స్‌ను మరో హీరోతో నిర్మించాలని అనుకుంటున్నారట.

ఈ క్రమంలో ఈ కథ విక్టరీ వెంకటేష్ సరిగ్గా సరిపోతారని చెర్రీ భావిస్తున్నారట. అందుకే త్వరలోనే వెంకటేష్‌ను కలిసి ఈ రీమేక్ కోసం ఒప్పించాలని అతడు ఆలోచిస్తున్నారట. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే చిరు కాకుండా మరో హీరోతో చెర్రీ నిర్మించే మొదటి చిత్రం ఇదే అవుతుంది. అయితే తన నిర్మాణ సంస్థలో మిగిలిన హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తానని అప్పట్లో ఓ సందర్భంలో చరణ్ వెల్లడించారు. అలాగే యంగ్ హీరోలతో సైతం తాను సినిమాలు తీస్తానని చెర్రీ తెలిపిన విషయం తెలిసిందే. మరి డ్రైవింగ్ లైసెన్స్‌లో ఎవరు నటిస్తారు..? చెర్రీ ఆఫర్‌కు వెంకీ ఓకే చెప్తారా..? ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారు..? అనే విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇదిలా ఉంటే లూసిఫర్ రీమేక్‌కు అప్పట్లో సుకుమార్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం పరశురామ్ ఈ రీమేక్‌ను హ్యాండిల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి లూసిఫర్ రీమేక్‌పై కూడా క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. కాగా ప్రస్తుతం వెంకటేష్. అసురన్ రీమేక్‌ నారప్పలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

రాజమౌళి 'వారణాసి'లో మరో స్టార్ యాక్టర్.. మహేష్ తండ్రి పాత్రలో..
రాజమౌళి 'వారణాసి'లో మరో స్టార్ యాక్టర్.. మహేష్ తండ్రి పాత్రలో..
2 రోజుల్లో CSIR UGC NET 2025 రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్
2 రోజుల్లో CSIR UGC NET 2025 రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్
కారు లుక్‌ మార్చాలని.. డబ్బుతో పాటు ఇంకా చాలా నష్టపోతారు!
కారు లుక్‌ మార్చాలని.. డబ్బుతో పాటు ఇంకా చాలా నష్టపోతారు!
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు..!
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు..!
శోభన్ బాబుపై మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శోభన్ బాబుపై మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
RRB NTPC 2024 గ్రాడ్యుయేట్‌ ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు లింక్
RRB NTPC 2024 గ్రాడ్యుయేట్‌ ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు లింక్
బ్యాంక్‌ నుంచి రూపాయ తీయడం లేదు .. ఐటీ శాఖకు డౌట్‌ వచ్చి..
బ్యాంక్‌ నుంచి రూపాయ తీయడం లేదు .. ఐటీ శాఖకు డౌట్‌ వచ్చి..
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్య పరిష్కారం కాబోతుంది..
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్య పరిష్కారం కాబోతుంది..
బ్లాక్ డ్రెస్‌లో మతిపొగొట్టే అందాలు.. మీర్నా అదిరిపోయే ఫొటోస్
బ్లాక్ డ్రెస్‌లో మతిపొగొట్టే అందాలు.. మీర్నా అదిరిపోయే ఫొటోస్
ఆ స్టార్ హీరోకు స్టోరీ చెప్పిన ముగ్గురు యంగ్ డైరెక్టర్లు
ఆ స్టార్ హీరోకు స్టోరీ చెప్పిన ముగ్గురు యంగ్ డైరెక్టర్లు