‘విశ్వాసం’ దర్శకుడితో రజినీ సినిమా..?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్‌లో ‘దర్బార్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. కాగా ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్‌లో పెడుతున్నాడట రజినీకాంత్. తాజా సమాచారం ప్రకారం ఆయన నివాసంలో ‘విశ్వాసం’ దర్శకుడు శివతో దాదాపు గంటకు పైగా స్క్రిప్ట్ మీద చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త […]

'విశ్వాసం' దర్శకుడితో రజినీ సినిమా..?
Follow us

|

Updated on: May 28, 2019 | 7:42 PM

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్‌లో ‘దర్బార్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. కాగా ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్‌లో పెడుతున్నాడట రజినీకాంత్.

తాజా సమాచారం ప్రకారం ఆయన నివాసంలో ‘విశ్వాసం’ దర్శకుడు శివతో దాదాపు గంటకు పైగా స్క్రిప్ట్ మీద చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో రెండేళ్లలో తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న రజినీకాంత్.. వీలైనంత త్వరగా సినిమాలు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. చూడాలి మరి తలైవా మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో.?