AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా జీవితంలో ఈ రోజుకెంతో ప్రత్యేకం.. ఎందుకంటే : రాఘవేంద్ర రావు

తన జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ చేశారు. ఈ రోజు అడవి రాముడు వచ్చి 43 సంవత్సరాలు, బాహుబలి 2 వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన అభిప్రాయాలను అభిమానులను పంచుకున్నారు. ”నా జీవితంలో ఓ మరుపురాని రోజు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారితో నా సినిమా ప్రస్థానం, మరో మెట్టు […]

నా జీవితంలో ఈ రోజుకెంతో ప్రత్యేకం.. ఎందుకంటే : రాఘవేంద్ర రావు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 28, 2020 | 5:27 PM

Share

తన జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ చేశారు. ఈ రోజు అడవి రాముడు వచ్చి 43 సంవత్సరాలు, బాహుబలి 2 వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన అభిప్రాయాలను అభిమానులను పంచుకున్నారు.

”నా జీవితంలో ఓ మరుపురాని రోజు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారితో నా సినిమా ప్రస్థానం, మరో మెట్టు ఎక్కిన రోజు. సినీ ప్రపంచంలో ఉన్న రికార్డులను తిరగరాసి, కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన రోజు. ఒక మాటలో చెప్పాలంటే అది చరిత్ర సృష్టించిన రోజు. 43ఏళ్ల క్రితం అడవి రాముడు విడుదలైన రోజు. ఆ నందమూరి అడవి రాముడిని మరోసారి గుర్తు చేసుకుంటూ.. ఆ సినిమా నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, డిస్టిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు ఆ చిత్ర దర్శకుడిగా, చట్టం ఆఫ్‌ ద షిప్‌గా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అడవి రాముడు రికార్డుల రాముడిగా ఎలా మారిందో కొన్ని ఉదాహరణలు.

4 సెంటర్లలో ఒక సంవత్సరం పాటు. 8 సెంటర్లలో 200 రోజులు.. 35 సెంటర్లలో 100 రోజులు.. ప్రదర్శింపబడటమే కాకుండా నెల్లూరు కనక మహల్‌ థియేటర్‌లో ప్రతిరోజు 5 షోలతో పాటు 100 రోజులు ఆడటం మరో విశేషం. బంగారానికి తావి అబ్బినట్టు ఏప్రిల్ 28 నాడే నా సమర్పణలో వచ్చిన బాహుబలి చిత్రం విడుదల కావడం నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. అడవి రాముడు ఆహా అనిపిస్తే.. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా సాహో అనిపించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తదితర నా కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు. రెండు పండగలని ఒకే రోజు అందించిన ఏప్రిల్ 28, కరోనా మహమ్మారిని తుద ముట్టించడానికి వేదికగా మారాలని ఆశిస్తూ.. అదే నిజమైన వేడుక అని భావిస్తూ.. ఈ మహాయఙ్ఞంలో పాలు పంచుకుంటున్న వైద్య సిబ్బందికి, పోలీస్‌ విభాగానికి, పారిశుద్ధ్య కార్మికులకు ధన్యావాదాలు తెలియజేస్తూ.. ఆ శ్రీనివాసుడి కరుణా కటాక్షాలతో భారతదేశం భవ్య దేశంగా విరాజిల్లాలని కోరుకుంటూ.. మీ రాఘవేంద్రరావు” అని ఆయన ఓ ప్రకటన చేశారు.

Read This Story Also: కేవలం సినిమా మాత్రమే కాదు.. నా జీవితంలోనే గుర్తుండిపోయే ఙ్ఞాపకం..!

డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
బెడ్ రూమ్‌లో కత్తెర ఎందుకు ఉంచొద్దు.. అసలు విషయం తెలిస్తే..
బెడ్ రూమ్‌లో కత్తెర ఎందుకు ఉంచొద్దు.. అసలు విషయం తెలిస్తే..