AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నయన్‌పై ప్రముఖ నటుడి కామెంట్లు.. మండిపడుతున్న కోలీవుడ్

లేడీ సూపర్‌స్టార్ నయనతారపై ప్రముఖ నటుడు రాధారవి అనుచిత వ్యాఖ్యలు చేశారు. చక్రి తోలేటి దర్శకత్వంలో నయనతార ‘కొలైయుదిర్ కాలమ్‌’లో నటించింది. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. దీనికి అతిథిగా హాజరైన రాధారవి మాట్లాడుతూ నయన్‌పై కామెంట్లు చేశారు. ‘‘నయనతార మంచి నటి. ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటా. ఇండస్ట్రీలో ఆమె చాలా కాలంగా పనిచేస్తున్నారు. తన మీద పలు ఆరోపణలు ఉన్నాయి. అయినా ఇంకా టాప్‌లో కొనసాగుతోంది. […]

నయన్‌పై ప్రముఖ నటుడి కామెంట్లు.. మండిపడుతున్న కోలీవుడ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 25, 2019 | 7:01 AM

Share

లేడీ సూపర్‌స్టార్ నయనతారపై ప్రముఖ నటుడు రాధారవి అనుచిత వ్యాఖ్యలు చేశారు. చక్రి తోలేటి దర్శకత్వంలో నయనతార ‘కొలైయుదిర్ కాలమ్‌’లో నటించింది. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. దీనికి అతిథిగా హాజరైన రాధారవి మాట్లాడుతూ నయన్‌పై కామెంట్లు చేశారు.

‘‘నయనతార మంచి నటి. ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటా. ఇండస్ట్రీలో ఆమె చాలా కాలంగా పనిచేస్తున్నారు. తన మీద పలు ఆరోపణలు ఉన్నాయి. అయినా ఇంకా టాప్‌లో కొనసాగుతోంది. తమిళ ప్రజలు ఏ విషయాన్నైనా నాలుగైదు రోజుల్లో మరిచిపోతారు. తను ప్రస్తుతం ఫేమస్ కావచ్చు. తనే సీత పాత్ర చేసింది. ఇప్పుడు దెయ్యాలు పాత్రలు చేస్తోంది. ఒకప్పుడు దేవుళ్ల పాత్రలలో నటించాలనే కేఆర్ విజయ దగ్గరకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు? ఎవరైనా చేయొచ్చు. గౌరవప్రదమైన వాళ్లైనా చేయొచ్చు, ఎవరెవరితో తిరిగేవాళ్లైనా నటింపచేయొచ్చు. ఈ మధ్య నయనతార ఎక్కువగా హారర్ సినిమాలలో నటిస్తోంది. తనను చూస్తూ దెయ్యాలే పారిపోతాయి’’ అంటూ కామెంట్లు చేశారు.

కాగా ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్‌లోని పలువురు మండిపడుతున్నారు. ‘‘ఒక గొప్ప సినిమా కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇంత అసభ్యకరంగా మాట్లాడినప్పుడు తనని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సపోర్ట్‌ చేయరు, ఎలాంటి యాక్షన్‌ తీసుకోరు. ఆయన స్పీచ్‌కు ప్రేక్షకులు కూడా నవ్వుతూ, చప్పట్లు కొట్టడం బాధగా ఉంది. నాకు తెలిసి ఈ సినిమాను మొదలుపెట్టిన దర్శకులు, నిర్మాతలు సగంలోనే వదిలిపెట్టారు. ఇలాంటి ఒక ఈవెంట్‌ జరుగుతుందని మాకు తెలియదు. అనవసరమైన ఈవెంట్‌ నిర్వహించి, అందులో ఇలాంటి అనవసరమైన వాళ్లను కూర్చోబెట్టి సినిమాను ప్రమోట్‌ చేయడం కంటే అలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పనికిమాలిన వారి వ్యర్థమైన భావాలను బయటకు చెప్పేందుకు ప్రోత్సహించడమే అవుతుంది. వీటిపై నడిగర్‌ సంఘంగానీ, మరో సంఘంగానీ ఎలాంటి యాక్షన్‌ తీసుకోరు. బాధాకరం’’ అంటూ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్ అన్నాడు.

‘‘స్త్రీల మీద అసభ్యకర మాటలు మాట్లాడటం (అది అసభ్యకరం కాదని వాళ్లు అనుకోవడం), తక్కువ చేయడం, వారిని కేవలం ఐ క్యాండీల్లా చూడటం ఇండస్ట్రీలో భాగం అయిపోయింది. ఇదంతా ఓకే అనుకుని ఇప్పటివరకూ మాట్లాడని స్త్రీ, పురుషులకు థ్యాంక్స్‌. అదీ మన పరిస్థితి. ఇలాంటి అనుభవం మీకు ఎదురైతేనే ఈ విషయం అర్థం అవుతుంది. అప్పుడు కనువిప్పు కలుగుతుంది. చిన్మయి, నేను, ఇంకెందరో స్త్రీలు ‘మీటూ’ అంటూ పోరాటం చేస్తున్న సమయంలో ఇండస్ట్రీలో ఉన్న ఉమెన్‌ మాతో నిలబడి ఉంటే.. ఏమో పరిస్థితుల్లో కొంచెమైనా మార్పు వచ్చేదేమో? మౌనం మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. ఈ సంఘాలన్నీ నడిపేది కూడా మగ అహంకారులే. ఈ విషయాలపై ఎలాంటి చర్యలు తీసుకోరు. కానీ స్త్రీలను సపోర్ట్‌ చేస్తున్నాం అని యాక్షన్‌ మాత్రం చేస్తుంటారు’’ అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ పేర్కొంది.

‘‘ఒక సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌పై రాధారవి స్టేజ్ మీదనే కామెంట్లు చేస్తున్నారు. వేరే యూనియన్స్‌ వాళ్ల విషయాల్లో ఇన్వాల్వ్‌ కాకూడదని ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్, నడిఘర్‌ సంఘం ఎటువంటి చర్య తీసుకోవడం లేదు’’ అంటూ గాయని చిన్మయి తెలిపింది.

అలాగే రాధారవి సోదరి, ప్రముఖ నటి రాధిక కూడా ఆయనపై విమర్శలు చేశారు. ‘‘మనకున్న డెడికేటెడ్‌ నటుల్లో నయనతార ఒకరు. తను నాకు తెలుసు. తనతో పని చేశాను కూడా. తను చాలా మంచి మనిషి. రాధారవి మాట్లాడిన వీడియో మొత్తం చూడలేదు. రవిని ఇవాళ కలిశాను. తను మాట్లాడింది కరెక్ట్‌ కాదని చెప్పాను’’ అని రాధిక చెప్పారు. ఇదిలా ఉంటే మరోవైపు ప్రముఖ నిర్మాణ సంస్థ కేజీఆర్ స్టూడియోస్ రాధారవిపై కఠినచర్యలు తీసుకుంది. ఇకపై ఆయన్ను తమ సినిమాలకు తీసుకోమని ఆ సంస్థ ప్రకటించింది.