బన్నీ సినిమాలో విలన్‌గా నానా పటేకర్?
అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకుడిగా వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా వీరిద్దరి కాంబోలో మరో సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. భారీస్థాయిలో నిర్మితం కానున్న ఈ సినిమా కోసం స్టార్ నటీనటుల్ని ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్. ఇప్పటికే బన్నీ తల్లి పాత్ర కోసం టబును తీసుకోవాలనే యోచనలో ఉన్న ఆయన విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ యాక్టర్ నానా పటేకర్ కోసం […]

అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకుడిగా వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా వీరిద్దరి కాంబోలో మరో సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. భారీస్థాయిలో నిర్మితం కానున్న ఈ సినిమా కోసం స్టార్ నటీనటుల్ని ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్. ఇప్పటికే బన్నీ తల్లి పాత్ర కోసం టబును తీసుకోవాలనే యోచనలో ఉన్న ఆయన విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ యాక్టర్ నానా పటేకర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంట. ఈ మధ్యే ‘కాల’ సినిమాలో రజనీకాంత్‌కు ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన నానా పటేకర్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆయన పలు తమిళ సినిమాలు చేసినా ఇప్పటివరకు తెలుగు మూవీస్‌లో నటించలేదు. కొత్తదనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే త్రివిక్రమ్ నానా పటేకర్ అయితే ప్రెష్ పేస్‌గా ఉంటుందని భావిస్తున్నారట. మరి ఈ అడుగులు ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.