AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: అప్పుడే మొదలైన పుష్ప 2 మేనియా.. వైరల్‌ అవుతోన్న లొకేషన్‌ ఫొటోలు..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎర్రచందనం నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా..

Pushpa 2: అప్పుడే మొదలైన పుష్ప 2 మేనియా.. వైరల్‌ అవుతోన్న లొకేషన్‌ ఫొటోలు..
Pushpa 2 Movie
Narender Vaitla
|

Updated on: Oct 18, 2022 | 6:05 AM

Share

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎర్రచందనం నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా రిలీజ్‌ అయిన అన్ని చోట్ల భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందీ సినిమా. మరోసారి తెలుగు సినిమా సత్తాను జాతీయ స్థాయిలో చాటిందీ సినిమా.

పుష్పరాజ్‌ ఎర్రచందనం సిండికేట్‌కు డాన్‌గా ఎదగడంతో పుష్ప తొలి పార్ట్‌ పూర్తయిన విషయం తెలిసిందే. అయితే పుష్పరాజ్‌, పోలీస్‌ ఆఫీసర్‌ బన్వర్‌ సింగ్‌ల మధ్య ఏర్పడ్డ వైరం నేపథ్యంగా పుష్ప2 సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పుష్ప తొలి పార్ట్‌ వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత పుష్ప సీక్వెల్‌ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా పుష్ప2కి సంబంధించి అధికారికంగా తొలి అప్‌డేట్‌ను ఇచ్చింది. షూటింగ్‌ స్పాట్‌కు సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన చిత్ర యూనిట్‌.. సినిమా యూనిట్‌ మొత్తం పుష్ప2ని అద్భుతంగా తీసుకురావడానికి తమ శక్తి మేర కృషి చేస్తున్నారని రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. పుష్ప2కి సంబంధించి ఎట్టకేలకు మొదటి అప్‌డేట్‌ రావడంతో బన్నీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us