‘ఎఫ్ 2’ సీక్వెల్.. అనిల్ ఆగాల్సిందేనా..!
ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకొని జోరుమీదున్న అనిల్ రావిపూడి తదుపరి ప్రాజెక్ట్‌గా ఎఫ్ 2 సీక్వెల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకొని జోరుమీదున్న అనిల్ రావిపూడి తదుపరి ప్రాజెక్ట్‌గా ఎఫ్ 2 సీక్వెల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎఫ్ 2లో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‌లు.. ఈ సీక్వెల్‌లో నటిస్తారని ఆయన క్లారిటీ కూడా ఇచ్చేశారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో తన స్వగ్రామంలో ఉన్న ఈ దర్శకుడు ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులను చేస్తున్నారు. ఇక లాక్‌డౌన్ ముగిసిన వెంటనే ఈ సీక్వెల్ పూజా కార్యక్రమాలు ప్రారంభించి, అక్టోబర్‌లో ఈ చిత్రానికి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ఈ దర్శకుడు భావించారు.
అయితే ఆయన ప్లాన్‌కు బ్రేక్ పడ్డట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కరోనా పూర్తైన తరువాతనే నారప్ప(తమిళ అసురన్ రీమేక్) షూటింగ్‌ను ప్రారంభించాలని వెంకటేష్ అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యే సరికి చాలా సమయమే పట్టనుంది. దీంతో ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లే సరికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా సినిమా, సినిమాకు పెద్దగా సమయం తీసుకునే అలవాటు అనిల్‌కు లేదు. ఈ క్రమంలో ఎఫ్ 2 సీక్వెల్ కంటే ముందు మరో చిత్రాన్ని అనిల్ తెరకెక్కించేందుకు సిద్ధమైనట్లు కూడా టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Read This Story Also: కరోనా లాక్‌డౌన్.. లావెక్కిన యువత.. సమస్యలు తప్పవా..!