మాస్‌రాజాకు మరో సినిమాను రెకమెండ్ చేసిన నాని..!

బయట పెద్దగా కనిపించకపోయినా రవితేజ, నాని మధ్య మంచి బాండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన వద్దకు వచ్చిన మంచి కథలను మాస్‌రాజా కోసం నాచురల్‌ స్టార్ రెకమెండ్ చేస్తున్నట్లు టాక్‌.

  • Tv9 Telugu
  • Publish Date - 5:55 pm, Sat, 23 May 20
మాస్‌రాజాకు మరో సినిమాను రెకమెండ్ చేసిన నాని..!

బయట పెద్దగా కనిపించకపోయినా రవితేజ, నాని మధ్య మంచి బాండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలో తన వద్దకు వచ్చిన మంచి కథలను మాస్‌రాజా కోసం నాచురల్‌ స్టార్ రెకమెండ్ చేస్తున్నట్లు టాక్‌. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాని మరో కథను రవితేజతో చేయాలని దర్శకుడికి సూచించినట్లు సమాచారం.

ఫిలింనగర్ వర్గాల ప్రకారం.. నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియాతో దర్శకుడిగా మారిన ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఇప్పుడు మరో సినిమాను తీసేందుకు రెడీ అయ్యారట. దీంతో ఓ కథను రాసుకొని దాన్ని నానికి వినిపించారట. మాస్‌ కథాంశంలతో ఉన్న ఈ కథ నానికి బాగా నచ్చిందట. కానీ తనకంటే ఈ కథ రవితేజకు బాగా సెట్ అవుతుందని అతడు వక్కంతంకి చెప్పారట. అంతేకాదు ఈ కథను వినమని, రవితేజకు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే వక్కంతం వంశీ, రవితేజకు కథ వినిపించబోతున్నట్లు టాక్.

కాగా గతంలో త్రినాథరావు తనకు చెప్పిన కథను కూడా నాని, రవితేజకు రెకమెండ్ చేసినట్లు సమాచారం. ఇక త్రినాథరావు-రవితేజ కాంబోలో సినిమా కన్ఫర్మ్ అవ్వగా.. లాక్‌డౌన్‌ తరువాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Read This Story Also: కరోనా టైమ్.. ఆసుపత్రికి అజిత్‌ దంపతులు.. టెన్షన్‌లో ఫ్యాన్స్..!