కరోనా లాక్‌డౌన్.. లావెక్కిన యువత.. సమస్యలు తప్పవా..!
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించగా అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ క్రమంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు బ్రిటీషర్లు లావెక్కారట.

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించగా అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ క్రమంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు బ్రిటీషర్లు లావెక్కారట. మూడు కిలోల నుంచి ఐదారు కిలోల వరకు వారు పెరిగినట్లు ఓ సర్వే తెలిపింది. మొత్తం 1000 మందిపై ఈ సర్వేను చేయగా.. అందులో 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు వారు పౌండ్ల కొద్దీ బరువెనక్కా, 65 ఏళ్లు దాటిన వృద్ధులు సగం బరువు పెరిగారట. సమయానికి పుష్టుగా భోజనం చేయడంతో పాటు శరీరానికి వ్యాయామం లేకపోవడం వలనే చాలా మంది బరువెక్కినట్లు సర్వే తెలిపింది.
అయితే లావు అవ్వడం వలన అధిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ బారిన పడిన వారిలో సాధరణ ప్రజల కన్నా స్థూలకాయులు 40 శాతం ఎక్కువగా మరణించే అవకాశం ఉందని బ్రిటన్ ఎన్‌హెచ్‌ఎస్ హెచ్చరిస్తోంది. అధిక బరువు ఉన్న వారు ఆక్సిజన్‌ని పీల్చుకోవడం కష్టమవుతుందుని ఆ సంస్థ తెలిపింది. కాగా బ్రిటన్‌లో కరోనా సోకి మరణించిన వారిలో 37 శాతం మంది స్థూలకాయులు, 29 శాతం మంది గుండెపోటుతో బాధపడుతున్న వారు, 19 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్న వారు ఉన్నట్లు అక్కడి అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
Read This Story Also: తన ఫ్లెక్సీ కట్టించిన కార్పొరేటర్‌కు ఫైన్ వేయించిన కేటీఆర్..!