అమెరికా H1B వీసా జారీలో కొత్త షరతులు..!

కరోనా వైరస్ దెబ్బకి అమెరికా విలవిలాడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ స్థాయిలో దెబ్బ పడింది. దీంతో ఆ దేశంలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగిపోయింది. అమెరికా పౌరుల ఉద్యోగ అవకాశాలకు గండి పడకుండా అమెరికా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అమెరికా చట్ట సభల్లో కీలకమైన బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసా జారీ విధానంలో కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తూ రెండు ప్రధాన పార్టీలు రూపొందించిన బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ది హెచ్‌-1బీ అండ్‌ ఎల్‌-1 […]

అమెరికా H1B వీసా జారీలో కొత్త షరతులు..!
Follow us

|

Updated on: May 23, 2020 | 6:43 PM

కరోనా వైరస్ దెబ్బకి అమెరికా విలవిలాడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ స్థాయిలో దెబ్బ పడింది. దీంతో ఆ దేశంలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగిపోయింది. అమెరికా పౌరుల ఉద్యోగ అవకాశాలకు గండి పడకుండా అమెరికా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అమెరికా చట్ట సభల్లో కీలకమైన బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసా జారీ విధానంలో కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తూ రెండు ప్రధాన పార్టీలు రూపొందించిన బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ది హెచ్‌-1బీ అండ్‌ ఎల్‌-1 వీసా రిఫార్మ్‌ యాక్ట్‌ పేరిట చట్టసభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే అమెరికాలో చదివిన విదేశీ నిపుణులకు తొలి ప్రాధాన్యం లభించేలా చూడటమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు. అమెరికా పౌరుల ఉపాధి కాపాడటం కూడా ఓ ఉద్దేశమని ఈ బిల్లులో పేర్కొన్నారు. బిల్లులోని ముఖ్యాంశాలు.. * ఉన్నత విద్య, నైపుణ్యం కలిగి అమెరికాలో చదువుకున్న చురుకైన విద్యార్థులకు హెచ్‌-1బీ వీసా జారీలో తొలి ప్రాధాన్యం. * అమెరికా ఉద్యోగుల స్థానాన్ని హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాదారులను భర్తీ చేయడాన్ని పూర్తిగా నిషేధించాలి. * ఈ వీసాదారుల వల్ల ఇతర అమెరికా ఉద్యోగులు, కార్మికుల పనితీరు, పని ప్రదేశంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలి. * తాత్కాలిక శిక్షణా ప్రయోజనాల కోసం పెద్ద సంఖ్యలో హెచ్‌-1బీ, ఎల్‌-1 ఉద్యోగులను దిగుమతి చేసుకుని తిరిగి వారిని సొంత దేశానికి పంపుతున్న అవుట్‌ సోర్సింగ్‌ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలి. * వీసా నిబంధనలు, ఉద్యోగుల నియామకాల విషయంలో నిబంధనలు అమలు చేసేలా లేబర్‌ డిపార్ట్‌మెంట్‌కు మరిన్ని అధికారాలను కట్టబెట్టడం. * ఆయా కంపెనీలు హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాదారుల సమగ్ర వివరాలు అందజేసేలా చూడాలి. * నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలితే శిక్షించే అధికారాన్ని కూడా బిల్లులో ప్రతిపాదించారు. * కచ్చితమైన వేతన నిబంధన అమలు చేస్తే విదేశీ ఉద్యోగులను కంపెనీలు తెచ్చుకోవన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదన.

ఇక బిల్లు గనక ఆమోదం పొందితే హెచ్ 1బీ వీసాదారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు