Priyanka Chopra: ప్రియాంక చోప్రాపై నెటిజన్ల ఫైర్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్..

సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాపై నెటిజన్లు మండిపడుతున్నారు. విషయం ఏంటంటే.. ప్రస్తుతం లండన్‏లో

Priyanka Chopra: ప్రియాంక చోప్రాపై నెటిజన్ల ఫైర్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 09, 2021 | 3:44 PM

Priyanka Chopra:  సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాపై నెటిజన్లు మండిపడుతున్నారు. విషయం ఏంటంటే.. ప్రస్తుతం లండన్‏లో కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం లాక్‏డౌన్ అమలు చేస్తోంది. అయితే గతవారం ప్రియాంక తన తల్లి మధు చోప్రాతో కలిసి సెలబ్రెటీ స్టైల్ జోస్ వుడ్కు సంబంధించిన సెలూన్‏కు వెళ్ళింది. వారిని గమనించిన పోలీసులు ప్రియాంకతోపాటు, సెలూన్ నిర్వహకులను కూడా హెచ్చరించారు. ఇక ఈ విషయం వైరల్ కావడంతో నెటిజన్లు ప్రియాంక తీరుపై మండిపడ్డారు. దీంతో ఆ వివాదంపై ప్రియాంక చోప్రా సిబ్బంది స్పందించింది.

లండన్ ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్‏లకు అనుమతి ఇచ్చిందని… అందుకోసమే ప్రియాంక అన్ని నిబంధనలు పాటిస్తూ.. సెలూన్‏కు వెళ్ళిందని తెలిపారు. అంతేకాకుండా షూటింగ్‏లో పాల్గొనే ముందు అక్కడి వారందరు కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారని.. ఎవరికి పాజిటివ్ రాలేదని.. దాంతో షూటింగ్ మొదలు పెట్టారని తెలిపారు. ప్రస్తుతం ప్రియాంక టెక్ట్ ఫర్ యూ అనే సినిమాలో నటిస్తుంది. ఆ మూవీ షూటింగ్ కోసం ఇటీవల లండన్‏కు వెళ్ళింది. ఇక కొన్ని రోజుల పాటు క్యారంటైన్లో ఉన్న తర్వాత ప్రియాంక చిత్రీకరణంలో పాల్గొంది.

Also Read: కోపంతో భర్తను కారు నుంచి దింపేసిన ప్రియాంక చోప్రా.. వీధుల్లో గొడవపడిన జంట.. అసలు కారణం ఏంటీ?..

‘ది వైట్ టైగర్’ సినిమాకు సంబంధించి మరో ట్రైలర్ విడుదల.. ఇందులో కొన్ని సన్నివేశాలను చూస్తే..