Amitabh Bachchan: అలనాటి ఫోటో షేర్ చేసుకున్న బిగ్ బీ.. మా నాన్న కంటతడి పెట్టడం అదే మొదటిసారి అంటూ..
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలతోపాటు, తన జీవితానికి సంబంధించిన అలనాటి ఫోటోలను
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలతోపాటు, తన జీవితానికి సంబంధించిన అలనాటి ఫోటోలను షేర్ చేస్తూ.. వాటికి సంబంధించిన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటుంటారు బిగ్ బీ. తాజాగా అలాంటి త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేస్తూ.. దానికి సంబంధించిన హిస్టరీని పంచుకున్నారు అమితాబ్. అందులో అమితాబ్ తన తండ్రి పాదాలను తాకుతూ నమస్కారిస్తు్న్నారు. పక్కనే అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ నిల్చోని వీరిద్దరిని గమనిస్తూ ఉన్నాడు. ముందుగా ఆ ఫోటోను ఓ అభిమాని ట్విట్టర్లో షేర్ చేయగా.. దానిని అమితాబ్ తన ఖాతాలో షేర్ చేస్తూ.. దాని వెనకగల కథను చెప్పుకోచ్చాడు.
అందులో.. “కూలీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో నేను చావు అంచుల వరకు వెళ్ళాను. కానీ అదృష్టవశాత్తు కోలుకుని తిరిగి ఇంటికి చేరుకున్నాను. ఆ సమయంలో మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకునేందుకు వంగి ఆయన పాదాలకు నమస్కరించాను. ఆ సమయంలో నన్ను చూసి మా నాన్నగారు ఒక్కసారిగా ఏడ్చారు. నాన్నను అలా చూడటం నా జీవితంలో మొదటిసారి. మా పక్కనే ఉన్న అభిషేక్ మమ్మల్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక శనివారం అమితాబ్ బచ్చన్ మరోక రికార్డ్ సాధించారు. బిగ్ బీ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య శనివారం నాటికి 45 మిలియన్లకు చేరుకుంది. దీంతో ట్విట్టర్ వేదికగా బిగ్ బీకి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అమితాబ్ బచ్చన్ ట్వీట్..
T 3777 – The caption informs of 45 million on Twitter .. thank you Jasmine, but the picture says a lot more .. Its the moment I came home surviving death after the ‘Coolie’ accident .. Its the first time ever I saw my Father breaking down ! A concerned little Abhishek looks on ! pic.twitter.com/vFC98UQCDE
— Amitabh Bachchan (@SrBachchan) January 9, 2021
Also Read: