Gunasekhar’s Shaakuntalam: శాకుంతలంలో దుష్యంతుడు ఎవరు..? ఆ క్రేజీ హీరోనే కరెక్ట్ అంటున్న గుణశేఖర్ !
శాకుంతలంలో శకుంతలగా సమంతను ఫిక్స్ చేశారు. మరి దుష్యంతుడు ఎవరు..? ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్. సమంత లాంటి స్టార్ హీరోయిన్ పక్కన లీడ్ రోల్..
Gunasekhar’s Shaakuntalam: శాకుంతలంలో ‘శకుంతల’గా సమంతను ఫిక్స్ చేశారు. మరి దుష్యంతుడు ఎవరు..? ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్. సమంత లాంటి స్టార్ హీరోయిన్ పక్కన లీడ్ రోల్.. అది కూడా ఓ మైథలాజికల్ మూవీలో కింగ్ క్యారెక్టర్. మరి అలాంటి రోల్‌లో ఏ హీరో నటిస్తారు. సమంత విరహానికీ, బాధకీ కారణమైన దుష్యంతుడి రోల్‌కి ఎవరిని తీసుకుంటారు. ఇప్పుడు ఇదే విషయంపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
అయితే ఈ విషయంలో పాన్ ఇండియా స్కెచ్ వేశారట దర్శకుడు గుణశేఖర్. శకుంతలను ప్రేమించి పెళ్లి చేసుకునే రాజు క్యారెక్టర్ కావటంతో… సూపర్ హ్యాండ్సమ్ హీరో అయితే ఆ రోల్‌కు కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట దర్శకుడు. అందుకే ఆ క్యారెక్టర్‌కు దుల్కర్ సల్మాన్‌ను సంప్రదిస్తున్నారన్నది లేటెస్ట్ అప్‌డేట్.
ఎక్స్‌పరిమెంటల్ రోల్స్‌కు ఎప్పుడూ రెడీగా ఉండే దుల్కర్.. ఈ పాత్రకు ఓకే చెబుతారన్న నమ్మకంతోనే ఉన్నారట మేకర్స్. నిజంగా దుల్కర్ ఆ రోల్ చేస్తే సినిమాకు పాన్ ఇండియా లెవల్‌లో ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. సౌత్‌తో పాటు హిందీలో కూడా దుల్కర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. సో దుష్యంతుడుగా దుల్కర్ నటిస్తే సినిమా బిజినెస్‌కు కూడా కలిసొస్తుందని ప్లాన్ చేస్తున్నారు. మరి నిజంగానే దుల్కర్ ఈరోల్‌కు ఓకే చెప్తారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.
Also Read :
Today Gold and Silver Price: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..తాజా రేట్లు ఇలా ఉన్నాయి