ప్రియాంకా చోప్రాకు మరో అరుదైన గౌరవం సొంతం

గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా మరో అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. సినీ రంగంలో ఈ ఏడాదికి గానూ అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో ప్రియాంకా చోటు దక్కించుకున్నారు. యూఎస్ఏ టుడే విమెన్ ది వరల్డ్ సమ్మిట్ 2019 జాబితాను ప్రకటించింది. ఇందులో ప్రియాంక అమెరికాకు చెందిన స్టార్స్ ఓప్రా విన్‌ఫ్రే, మెరిల్ స్ట్రీవ్‌లతో పాటు ఉన్నారు. న్యూయార్క్‌ లో ఏప్రిల్ 10 నుంచి 12 వరకు ఈ వేడుక జరగనుంది. ఇది తన […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:06 am, Wed, 20 March 19
ప్రియాంకా చోప్రాకు మరో అరుదైన గౌరవం సొంతం

గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా మరో అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. సినీ రంగంలో ఈ ఏడాదికి గానూ అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో ప్రియాంకా చోటు దక్కించుకున్నారు. యూఎస్ఏ టుడే విమెన్ ది వరల్డ్ సమ్మిట్ 2019 జాబితాను ప్రకటించింది. ఇందులో ప్రియాంక అమెరికాకు చెందిన స్టార్స్ ఓప్రా విన్‌ఫ్రే, మెరిల్ స్ట్రీవ్‌లతో పాటు ఉన్నారు. న్యూయార్క్‌ లో ఏప్రిల్ 10 నుంచి 12 వరకు ఈ వేడుక జరగనుంది.

ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు.. ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది ప్రియాంకా చోప్రా. సవాళ్లను ఎదుర్కొంటూ సొంతంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్గం ఏర్పరుచుకుని.. ఎంచుకున్న కెరీర్‌లో గర్వంగా రాణిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.