తదుపరి షెడ్యూల్‌కు సిద్దమైన ప్రభాస్

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ‘సాహో’ షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఆగష్టు 15న రానున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. దీంతో ఈ మూవీ షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో భాగం అవ్వనున్నాడు. పీరియాడిక్ ప్రేమ కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్ర మొదటి షెడ్యూల్ యూరప్‌లో పూర్తి అవ్వగా.. రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ అద్భుతమైన సెట్‌ను […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:56 am, Wed, 20 March 19
తదుపరి షెడ్యూల్‌కు సిద్దమైన ప్రభాస్

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ‘సాహో’ షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఆగష్టు 15న రానున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. దీంతో ఈ మూవీ షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో భాగం అవ్వనున్నాడు. పీరియాడిక్ ప్రేమ కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్ర మొదటి షెడ్యూల్ యూరప్‌లో పూర్తి అవ్వగా.. రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు.

దీనికి సంబంధించి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ అద్భుతమైన సెట్‌ను వేశారు. రవీందర్ వేసిన ఈ సెట్‌లో దాదాపు 15రోజుల పాటు షూటింగ్ జరగనుంది. సినిమాలో కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.