సెట్స్‌పైకి కీర్తి 20వ చిత్రం.. నటీనటులు వీరే

‘మహానటి’ కీర్తి సురేశ్ తన 20వ చిత్రాన్ని ప్రారంభించారు. నరేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవల సెట్స్ మీదకు వెళ్లింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో కీర్తి20వ ప్రాజెక్ట్‌లో భాగం అయిన నటీనటులను ప్రకటించారు నిర్మాత మహేశ్ కోనేరు. #ECP3 #Keerthy20 On floors now .. here are the lead […]

సెట్స్‌పైకి కీర్తి 20వ చిత్రం.. నటీనటులు వీరే
Follow us

| Edited By:

Updated on: Mar 20, 2019 | 10:49 AM

‘మహానటి’ కీర్తి సురేశ్ తన 20వ చిత్రాన్ని ప్రారంభించారు. నరేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవల సెట్స్ మీదకు వెళ్లింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో కీర్తి20వ ప్రాజెక్ట్‌లో భాగం అయిన నటీనటులను ప్రకటించారు నిర్మాత మహేశ్ కోనేరు.

కమల్ కామరాజు, రాజేంద్రప్రసాద్, నరేశ్, నదియా, భాను శ్రీ మెహ్రా ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించనున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలో మరికొందరు స్టార్లు ఈ మూవీలో భాగం కానున్నారని మహేశ్ కోనేరు వెల్లడించారు. కాగా లేడి ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే.