క్రేజీ కాంబోలో ఆఫర్ దక్కించుకున్న నానీ హీరోయిన్.. మాస్ మాహారాజా సరసన ఆ ముద్దుగుమ్మ..
హీరో నానీ 'గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ తెగ
హీరో నానీ ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ తెగ బిజీగా మారిపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న శ్రీకారం సినిమాలో నటిస్తుంది. ఇక ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం టాలీవుడ్ మాస్ మాహారాజా రవితేజ సరసన చాన్స్ కొట్టెసిందట ఈ అమ్మడు.
‘క్రాక్’ సినిమా విజయంతో రవితేజ వరుస సినిమాలకు ఓకే చెప్పెస్తున్నాడు. ఇప్పటికే ‘ఖిలాడి’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు రవితేజ. ఆ తర్వాత దర్శకుడు నక్కిన త్రినాధరావు, రవితేజ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజకు జోడీగా నటించేందుకు ప్రియాంక అరుళ్ మోహన్ ఎంపికైందట. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్గా ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రినాథ రావు ‘సినిమా చూపిస్తా మామ’, ‘నేను లోకల్’ వంటి ఎంటర్ టైన్మెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ దర్శకుడు. తాజాగా రవితేజతో కలిసి తీయబోయే సినిమా కూడా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో… వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాపై ప్రేక్షకులను నవ్వించనున్నారు.
Also Read:
డిజిటల్ వైపు అడుగులెస్తున్న మరో హీరోయిన్.. బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వనున్న బబ్లీ బ్యూటీ..