బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వనున్న అక్కినేని హీరో.. పాన్ ఇండియా స్టార్‏గా మారెందుకు ప్లాన్.. కానీ..

తెలుగు ఇండస్ట్రీలో బహుబాలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు ప్రభాస్. టాలీవుడ్‏లో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్

బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వనున్న అక్కినేని హీరో.. పాన్ ఇండియా స్టార్‏గా మారెందుకు ప్లాన్.. కానీ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 26, 2021 | 8:47 AM

తెలుగు ఇండస్ట్రీలో బహుబాలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు ప్రభాస్. టాలీవుడ్‏లో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు పాన్ ఇండియా స్టార్స్‏గా మారిపోయారు. ఇక వీరిబాటలోనే మరో హీరో కూడా పాన్ ఇండియా స్టార్‏గా మారెందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అతనెవరో కాదండోయ్.. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య. తాజా సమాచారం ప్రకారం అక్కినేని చైతూ ఓ బాలీవుడ్ మూవీలో కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అది బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. అతడు ప్రస్తుతం చేస్తున్న మువీ ‘లాల్ సింగ్ చద్దా’. ఇది హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్‏గా తెరకెక్కుతుంది. ఇందులో ఓ కీలక పాత్రలో చైతూ నటించబోతున్నట్లుగా సమాచారం. కాగా ఆ పాత్ర కోసం ముందుగా తమిళ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకోవాలనుకున్నారట. కానీ డేట్స్ కుదరకపోవడం వలన చైతూని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే గనుక నిజమైతే అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చైతూ తన క్రేజ్ సంపాదించుకోనేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి.

Also Read:

అక్కినేని హీరో ఆశలన్ని ఆ సినిమా మీదే.. బండి తీయడానికి కాస్త లేట్ అయ్యిందట.. దుమ్ము దులుపుదామా అంటూ..