Fauzi: ఫౌజీ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్.. వీడియో చూశారా..
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫౌజీ మూవీ అప్డేట్ వచ్చేసింది. భగవద్గీత ఆధారంగా కోడ్ సృష్టించే ఒక వీరుడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతుండగా, ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది.

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్, గ్లింప్స్ , విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పవర్‌ఫుల్ వీడియోను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డులను సృష్టిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. ‘ఫైల్ నం. 25: ఫౌజీ’ (File no. 25 : FAUZI) పేరుతో విడుదలైన ఈ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ , అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సంభాషణతో కథ ప్రారంభమవుతుంది. బ్రిటీష్ వారిని ఓడించడానికి జర్మనీ సహాయం కోరడానికి వెళ్లిన సుభాష్ చంద్రబోస్ తో హిట్లర్ మాట్లాడే సీన్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఇండియన్ల రక్త్‌లో బానిసత్వం ఉందని, యుద్ధంలో గెలవడం కష్టమని హిట్లర్ అనగా.. ఇంటెలిజెన్స్ గురించి, బ్రిటిష్వారిని గడగడలాడించిన ఒకే ఒక్క సైనికుడి గురించి బోస్ వివరిస్తారు.
బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆ సైనికుడిని ‘ఫౌజీ’ అని పిలుస్తారని, భగవద్గీత ఆధారంగా అతడు సృష్టించిన కోడ్ ఎనిగ్మా కంటే ప్రమాదకరమని బోస్ చెప్పే డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. చివరిలో ప్రభాస్ మాస్ ఎంట్రీ ఇచ్చి, బ్రిటీష్ అధికారులను హెచ్చరిస్తూ చెప్పే మాస్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను స్కై-హైకి తీసుకెళ్లాయి.
కేవలం గ్లింప్స్‌తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రబృందం, ఈ మూవీ విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమాను 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఫౌజీ అప్డేట్…
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda – Allu Arjun: అర్దరాత్రి బన్నీకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే..
