సంచి చేత పట్టి.. సైకిల్ ఎక్కి.. క్యూట్‌గా పూజా లుక్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘వాల్మీకి’. ఇందులో కోలీవుడ్ నటుడు అధర్వ కీలక పాత్రలో నటించగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక ఇందులో శ్రీదేవి పాత్రలో ఆమె కనిపించగా.. దానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను పూజా తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసింది. అందులో సైకిల్ ఎక్కి, సంచి చేత పట్టి, రెండు జళ్లతో క్యూట్‌గా కనిపిస్తోంది పూజా. కాగా తమిళంలో విజయం సాధించిన ‘జిగర్తాండ’ రీమేక్‌గా వాల్మీకి […]

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘వాల్మీకి’. ఇందులో కోలీవుడ్ నటుడు అధర్వ కీలక పాత్రలో నటించగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక ఇందులో శ్రీదేవి పాత్రలో ఆమె కనిపించగా.. దానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను పూజా తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసింది. అందులో సైకిల్ ఎక్కి, సంచి చేత పట్టి, రెండు జళ్లతో క్యూట్‌గా కనిపిస్తోంది పూజా.
కాగా తమిళంలో విజయం సాధించిన ‘జిగర్తాండ’ రీమేక్‌గా వాల్మీకి తెరకెక్కింది. ఇందులో వరుణ్ విలన్‌గా కనిపించనున్నాడు. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఇటీవలే టీజర్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉండగా.. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
From our hearts to yours…Bringing you…..Sridevi ❤️ #Valmiki #Sridevi @harish2you @IAmVarunTej pic.twitter.com/tKnHxkwmdz
— Pooja Hegde (@hegdepooja) August 25, 2019