ఈయనెవరో చెప్పుకోండి చూద్దాం.. ‘తలా’ కాదు కదా! ‘న్యూ లుక్’ మాత్రం సూపర్బ్!

ఈయనెవరో చెప్పుకోండి చూద్దాం.. 'తలా' కాదు కదా! 'న్యూ లుక్' మాత్రం సూపర్బ్!

తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న స్టార్ హీరో అజిత్ కుమార్. ఈ ఏడాది మొదట్లో ‘విశ్వాసం’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన అజిత్.. తాజాగా ‘నెర్కొండ పార్వాయి’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాడు. ఇక తన కొత్త సినిమా కోసం ఇప్పుడు గెటప్ మార్చాడు. క్లీన్ షేవ్​తో ట్రెండీ లుక్​లో దర్శనమిస్తూ ఫుల్ యంగ్‌గా ఉన్న అజిత్‌ను చూసి.. అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ సింపుల్‌గా.. తెల్లటి గడ్డం, నెరిసిన జుట్టుతో సహజంగా ఉండే […]

Ravi Kiran

|

Aug 26, 2019 | 12:14 PM

తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న స్టార్ హీరో అజిత్ కుమార్. ఈ ఏడాది మొదట్లో ‘విశ్వాసం’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన అజిత్.. తాజాగా ‘నెర్కొండ పార్వాయి’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాడు. ఇక తన కొత్త సినిమా కోసం ఇప్పుడు గెటప్ మార్చాడు. క్లీన్ షేవ్​తో ట్రెండీ లుక్​లో దర్శనమిస్తూ ఫుల్ యంగ్‌గా ఉన్న అజిత్‌ను చూసి.. అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఎప్పుడూ సింపుల్‌గా.. తెల్లటి గడ్డం, నెరిసిన జుట్టుతో సహజంగా ఉండే అజిత్.. ప్రతి సినిమాకు ఒకే తరహా గెటప్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటాడు. అయితే తాజాగా గెటప్ మార్చి డీసెంట్ హెయిర్​ కట్​తో సందడి చేస్తున్నాడు.

మరోవైపు అజిత్ తన 60వ చిత్రాన్ని వినోద్ దర్శకత్వంలో చేయనున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను బోణి కపూర్ నిర్మించనున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu