Pooja Hegde: ప్రభాస్ దగ్గరున్న అతడిని దొంగిలిస్తా.. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. పూజా హెగ్డే కామెంట్స్..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఫౌజీ, స్పిరిట్ చిత్రాలతోపాటు మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ డార్లింగ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. దీంతో ఇప్పుడు డార్లింగ్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రభాస్ సరసన నటించిన హీరోయిన్ పూజా హెగ్డే చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టంట వైరలవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రెబల్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
ప్రభాస్ జోడిగా తాను రాధే శ్యామ్ సినిమాలో నటించానని తెలిపింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో తనకు ప్రభాస్ పంపిన ఫుడ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి ఇంకేం లేదని.. తనకు ఛాన్స్ వస్తే.. ప్రభాస్ దగ్గర ఉండే కుక్ ను దొంగిలిస్తానని అన్నారు. పూజా హెగ్డే చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..
ఇదిలా ఉంటే.. ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే.. ఇప్పుడు సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తుంది. చాలా కాలంగా ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవుతున్నాయి. అయినప్పటికీ ఈబ్యూటీకి అవకాశాలు మాత్రం క్యూ కడుతున్నాయి. ఈ అమ్మడు ఇటీవల కోలీవుడ్ హీరో విజయ్ దళపతి జోడిగా జన నాయగన్ చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని జూలై 23న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇది విజయ్ దళపతి చివరి చిత్రం కావడం విశేషం..
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
