AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Payal Rajput : ఆ హీరోయిన్ గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే.. క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్

పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ భామ కు కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది.

Payal Rajput : ఆ హీరోయిన్ గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే.. క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్
Rajeev Rayala
|

Updated on: Jan 26, 2021 | 8:06 AM

Share

Payal Rajput : పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ భామ కు కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. ఆతర్వాత పాయల్ రాజ్ పుత్ వెంకీమామ చిత్రంలో నటించిన మరో సక్సెస్ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఐటమ్ సాంగ్ లో మెరిసి అందరిని ఆకట్టుకుంది. కాజల్, శ్రీనివాస్ బెల్లంకొండ హీరోహీరోయిన్లుగా నటింటిన సీత సినిమాలో బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి.. రాజ్‏దూత్ మీదొచ్చే అంటూ ఓ స్పెషల్ సాంగ్‏లో కనిపించింది. తాజాగా సమాచారం ప్రకారం పాయల్ మరో స్పెషల్ సాంగ్‏కు ఓకే చెప్పిందట.

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘మహా సముద్రం’ అనే సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. ఇందులో అదితీ రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. ఇక ఈ పాటలో హీరోయిన్ పాయల్ రాజ్‏పుత్ స్టెప్పులేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ పుకారులే అని తేల్చి చెప్పింది చిత్రయూనిట్. ఈ సినిమా కోసం అసలు పాయల్ రాజ్ పూత్ ను సంప్రదించిందే లేదు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దాంతో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది.

మరిన్ని ఇక్కడ చదవండి : అక్కినేని హీరో ఆశలన్ని ఆ సినిమా మీదే.. బండి తీయడానికి కాస్త లేట్ అయ్యిందట.. దుమ్ము దులుపుదామా అంటూ..