అక్కినేని హీరో ఆశలన్ని ఆ సినిమా మీదే.. బండి తీయడానికి కాస్త లేట్ అయ్యిందట.. దుమ్ము దులుపుదామా అంటూ..

చాలా కాలం తర్వాత అక్కినేని హీరో సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు'. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి నో పార్కింగ్

  • Rajitha Chanti
  • Publish Date - 7:44 am, Tue, 26 January 21
అక్కినేని హీరో ఆశలన్ని ఆ సినిమా మీదే.. బండి తీయడానికి కాస్త లేట్ అయ్యిందట.. దుమ్ము దులుపుదామా అంటూ..

చాలా కాలం తర్వాత అక్కినేని హీరో సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి నో పార్కింగ్ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీనికి ఎస్. దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుశాంత్‏కు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. ఏ1 స్టూడియోస్ మరియు శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి- ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏కు విశేషస్పందన లభించింది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ తేదీని ప్రకటించింది చిత్రబృందం.

ఈ సందర్భంగా హీరో సుశాంత్‏కు సంబంధించిన ఓ చిన్న వీడియోను షేర్ చేసింది చిత్రయూనిట్. అందులో అప్పుడెప్పుడో మార్చి 2020లో ఓ చిన్న టీజర్ వదిలాం… ఆ తర్వాత అన్ని పోస్టర్స్.. లాక్‏డౌన్ కదా బండి తీయడం కొంచెం లేట్ అయ్యింది.. కాస్తా దుమ్ము దులుపుదామా అంటూ సుశాంత్ ఇందులో బైక్ తీయడానికి రెడీ అయినట్లుగా చూపించారు. ఇక ఈ మూవీ టీజర్‏ను జనవరి 29న ఓ ప్రముఖ హీరో విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. ఇక ఆ హీరో ఎవరనేది జనవరి 27న రివీల్ చేయనున్నారు. ఇటివలే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది.