యాక్టింగ్‌తో మెప్పిస్తోన్న పవన్, రేణుల‌ తనయ ఆధ్య.. వీడియో వైరల్..!

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్, రేణు దేశాయ్‌ల కుమార్తె ఆధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ మధ్యన రేణు ఇచ్చిన లైవ్‌లో పాట పాడి మెప్పించిన ఈ 10 ఏళ్ల కొణిదెల వారసురాలు

  • Tv9 Telugu
  • Publish Date - 8:12 am, Mon, 4 May 20
యాక్టింగ్‌తో మెప్పిస్తోన్న పవన్, రేణుల‌ తనయ ఆధ్య.. వీడియో వైరల్..!

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్, రేణు దేశాయ్‌ల కుమార్తె ఆధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ మధ్యన రేణు ఇచ్చిన లైవ్‌లో పాట పాడి మెప్పించిన ఈ 10 ఏళ్ల కొణిదెల వారసురాలు.. ఈ సారి తన యాక్టింగ్ స్కిల్స్‌ను బయటపెట్టింది. ఓ చిన్న క్లిప్‌లో ఆధ్య ద్విపాత్రాభినయం చేసింది. దానికి సంబంధించిన వీడియోను రేణు దేశాయ్‌ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ క్లిప్‌కు రచన, నటన, దర్శకత్వం, ఎడిటింగ్ అన్నీ ఆధ్యనే చేసిందని రేణు పేర్కొంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్ పెడుతున్నారు. మరికొందరు మల్టీ టాలెంటెడ్‌ ఆధ్య అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇంకొందరేమో ఈ వయస్సులోనే ఆధ్య అదరగొట్టేస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే జానీ మూవీ తరువాత యాక్టింగ్‌కు దూరమైన రేణు దేశాయ్‌.. ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్‌ చిన్నప్పటి పాత్రలకు అమ్మగా చేసేందుకు తాను రెడీ అని రేణు వెల్లడించారు.

Read This Story Also: ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు.. కొత్త ధరలివే..!

https://www.instagram.com/p/B_mgKnrhV1P/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again